Bajra Roti For Bad Cholesterol: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మరి కొందరైతే మిల్లెట్స్‌తో తయారు చేసి ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే తృణధాన్యాలను ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్ల గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్, జింక్, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్లు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో లభించే గుణాలు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే తృణధాన్యాలతో చేసిన బజ్రా రోటీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బజ్రా రోటీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మాన్ని యవ్వనంగా మార్చుతుంది:
మిల్లెట్స్ చాలా రకాల ఔషద గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన బజ్రా రోటీలను తినడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే లక్షణాలు చర్మం ముడతల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి రోజూ మిల్లెట్స్ తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తుంది.
గుండెపోటు:
మిల్లెట్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రతి రోజూ తీసుకుంటే శీతాకాలంలో వచ్చే గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ బజ్రా రోటీ తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
అధిక రక్తపోటు:
మిల్లెట్లో మెగ్నీషియం అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటితో తయారు చేసి ఆహారాలు ప్రతి రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉండి. అధిక రక్త పోటు సమస్యలను కూడా సులభంగా నియంత్రిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె పోటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి