Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే...!

కరోనా ఉద్ధృతి తగ్గడంతో థియేటర్లలో సందడి మెుదలైంది. వెండితెరపై అలరించేందుకు పలు సినిమాలు సిద్దమయ్యాయి. అదే విధంగా ఓటీటీలు కూడా కొత్త వెబ్ సిరీస్ లతో ముందుకొస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 01:49 PM IST
  • తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైన సినిమాలు
  • థియేటర్లలో రిలీజ్ కానున్న రిపబ్లిక్‌, నో టైమ్‌ టు డై
  • అక్టోబరు 1వ ఆహాలో 'ఓరేయ్ బామ్మర్ది' మూవీ స్ట్రీమింగ్
Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే...!

Upcoming Movies: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు(Theaters) తెరుచుకున్నాయి. మరో వైపు కొత్త వెబ్ సిరీస్ లు ఓటీటీ(OTT)లు తళుక్కున మెరుస్తున్నాయి. మరి ఈ వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలు ఏంటో చూసేద్దామా!

థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు!

'నో టైమ్‌ టు డై'’
వరల్డ్ వైడ్ గా జేమ్స్‌ బాండ్‌(James Bond) చిత్రాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ బాండ్‌ సిరీస్‌ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేనియల్‌ క్రెగ్‌(Daniel‌ Craig) హీరోగా నటించిన చిత్రమిది. విలన్‌ సఫీన్‌గా రామి మాలెక్‌ నటిస్తున్నారు. కారీ జోజి దర్శకుడు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబరు 30న బాండ్‌ థియేటర్‌లలో సందడి చేయనున్నాడు. అమెరికాలో అక్టోబరు 8న ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ‘బాండ్‌’ మూవీపై అంచనాలను భారీగా పెంచింది.

రిపబ్లిక్‌
సాయిధరమ్ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపబ్లిక్‌(Republic)’. దేవకట్టా దర్శకుడు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో సాయితేజ్‌(Sai Dharam Tej) కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయాల కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేసేలా ఈ చిత్రం తెరకెక్కింది. 

Also read: Adivi Sesh: అడివి శేష్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్..కోలుకుంటున్న హీరో..

'ఇదే మా కథ'
శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘'ఇదే మా కథ'’. నాలుగు కథల సమాహారంగా తెరకెక్కుతోందీ చిత్రం. గురు పవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. 

‘అసలు ఏం జరిగిందంటే'
1999లో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ‘దేవి’. అందులో మాంత్రికుడు చిన్న పిల్లాడిగా మారిపోతాడు. మాస్టర్‌ మహేంద్రన్‌ ఆ పాత్రలో తనదైన హావభావాలు పలికించాడు. ఇప్పుడు ఆ పిల్లాడు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. శ్రీనివాస్‌ బందరి దర్శకుడు. అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఓటీటీలో అలరించే చిత్రాలివే!

ఓరేయ్ బామ్మర్ది
సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’తో ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి ‘ఒరేయ్‌ బామ్మర్ది’ స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌
* బ్రిట్నీ వర్సెస్‌ స్పియర్స్‌ - సెప్టెంబరు 28
* నో వన్‌ గెట్స్‌ అవుట్‌ ఎలైవ్‌- సెప్టెంబరు 29
* ద గల్టీ- అక్టోబరు 1
* డయానా -అక్టోబరు 1

డిస్నీ+హాట్‌స్టార్‌
* షిద్ధత్‌ -అక్టోబరు 1
* లిఫ్ట్‌- అక్టోబరు 1

అమెజాన్‌ ప్రైమ్‌
* చెహ్రే -సెప్టెంబరు 30
* బింగ్‌ హెల్‌- అక్టోబరు 1
* బ్లాక్‌ ఆజ్‌ నైట్‌- అక్టోబరు 1

సోనీ లివ్‌
* ది గుడ్‌ డాక్టర్‌- సెప్టెంబరు 28

జీ5
* బ్రేక్‌ పాయింట్‌ -అక్టోబరు 1

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News