Devi Sriprasad Comments: పుష్ప ఐటెమ్ సాంగ్‌లో వేరెవరు నటించినా అంత సీన్ ఉండేది కాదు

Devi Sriprasad Comments: ఊ అంటావా పాపా..ఊహూ అంటావాతో దుమ్ము రేపుతున్న పుష్ప ఐటెమ్ సాంగ్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంతను ఉద్దేశించి దేవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2022, 10:08 AM IST
Devi Sriprasad Comments: పుష్ప ఐటెమ్ సాంగ్‌లో వేరెవరు నటించినా అంత సీన్ ఉండేది కాదు

Devi Sriprasad Comments: ఊ అంటావా పాపా..ఊహూ అంటావాతో దుమ్ము రేపుతున్న పుష్ప ఐటెమ్ సాంగ్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంతను ఉద్దేశించి దేవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో దేవి శ్రీప్రసాద్ సంగీతంలో..బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ మెగా హిట్ సాధించింది. పుష్ప సినిమా అంతా ఒక ఎత్తైతే..అందులో ఐటెమ్ సాంగ్ ఒక ఎత్తు. తొలిసారిగా ఐటెమ్ సాంగ్‌లో నటించిన సమంత దుమ్ము రేపేసింది. ఊ అంటావా అంటూ అభిమానుల్ని వెర్రెక్కించేసింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత తొలిసారిగా ఐటెమ్ సాంగ్‌లో నటించి హల్‌చల్ చేసింది. 

ఈ ఐటెమ్ సాంగ్ విషయంలో సమంతపై (Samantha) సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రశంసలు కురిపించాడు. పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్‌కు సమంత మాత్రమే సరిపోతుందని దేవీ చెప్పాడు. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని..ఆ కొత్తదనం సమంతలో కన్పించిందన్నాడు. పుష్ప పాట పూర్తయినా..ఎవరు చేస్తున్నారనే క్లారిటీ ముందు లేదని..సమంతను ఎంపిక చేయాలనే నిర్ణయం పూర్తిగా సుకుమార్, బన్నీలదేనన్నాడు. ఆ ఇద్దరే సమంతను ఒప్పించారన్నాడు. అసలు తన పాటకు సమంత నటిస్తుందని తెలియగానే చాలా హ్యాపీగా అన్పించిందన్నాడు. పుష్ప(Pushpa) సినిమాలో ఆ ఐటెమ్ సాంగ్‌కు సమంత కాకుండా మరెవరు చేసినా అంత స్పందన ఉండకపోయేదని డీఎస్పీ(Devi Sriprasad)అంటున్నాడు. 

Also read: Dhanush Aishwarya Divorce : విడిపోయిన మరో జంట.. విడాకులు తీసుకున్న ఐశ్వర్య, ధనుష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News