Puri Jagannadh Daughter Pavithra Jagannadh to Enter Films: పూరీ జగన్నాథ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆపై రవితేజ, మహేష్ బాబు, నాగార్జున, చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో సినిమాలు చేసి వరుస హిట్లు కొడుతూ స్టార్ డైరెక్టర్ అయ్యారు. మధ్యలో కొన్ని ఫ్లాఫులు ఎదురైనా.. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో గాడిలో పడ్డారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండలో లైగర్ సినిమా చేస్తున్నారు.
మాస్, యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో పూరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఓవైపు స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి.. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. వైష్ణో అకాడమీ పేరుతో ప్రొడెక్షన్ హౌస్‌ను స్థాపించిన ఆయన.. ఆ తర్వాత ఇదే సంస్థను 'పూరీ కనెక్ట్స్'గా మార్చి ఆ బ్యానర్‌లోనే సినిమాలను చేస్తున్నారు. అయితే ఈ బ్యానర్ నిర్మాణ బాధ్యతలని హీరోయిన్ ఛార్మి చూసుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఛార్మీని పూరీ పక్కన పెట్టబోతున్నారని తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.
పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ జగన్నాథ్ ఇప్పటికే టాలీవుడ్ తెరంగేట్రం చేయగా.. కూతురు పవిత్ర జగన్నాథ్ కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట. అయితే పవిత్ర ఎంట్రీ ఇచ్చేది హీరోయిన్‌గా మాత్రం కాదట. పూరీ నిర్మాణ సంస్థ 'పూరీ కనెక్ట్స్'లో పవిత్ర కూడా నిర్మాతగా ఉండనున్నట్టు సమాచారం తెలుస్తోంది. మరి ఛార్మీతో కలిసి పవిత్ర పూరీ కనెక్ట్స్ బాధ్యతలు చూస్కుంటారా లేదా సోలోగానే అని తెలియాల్సి ఉంది.
సినీ పరిశ్రమలో ఉన్న తక్కువ మంది నిర్మాతల్లో పవిత్ర జగన్నాథ్ కూడా ఒకరు కాబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 'బుజ్జిగాడు' సినిమాలో పవిత్ర నటించిన విషయం తెలిసిందే. పవిత్రకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం కంటే.. నిర్మాణం అంటే ఎంతో ఇష్టమని గతంలో ఆకాశ్ పూరీ చెప్పాడు.
Aslo Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook