Sonakshi Sinha Marriage: సోనాక్షి, జహీర్ ల మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా.. ?

Sonakshi Sinha Marriage: సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ షాట్ గన్ శతృఘ్న సిన్హా, నటి పూనమ్ ల ముద్దలు కూతురు. వాళ్ల వారసత్వంతో సినీ రంగం ప్రవేశం చేసిన సోనాక్షి నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ తన ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో ముగింపు పలికింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను సింపుల్ గా పెళ్లి చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 24, 2024, 04:28 PM IST
Sonakshi Sinha Marriage: సోనాక్షి, జహీర్ ల మధ్య  ఇంత ఏజ్ గ్యాప్ ఉందా.. ?

Sonakshi Sinha Marriage: సోనాక్షి సిన్హా.. శతృఘ్న సిన్హా కూతురుగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. తాజాగా ఈ భామ తన ప్రియుడు జహీర్  ఇక్బాల్  ను ప్రేమ వివాహాం చేసుకుంది. గత 7 కొన్నేళ్లుగా వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు. అంతేకాదు వీరిద్దరి సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ  వివాహా వేడుకకు సల్మాన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మరోవైపు సోనాక్షి పెళ్లి వాళ్ల నాన్న శతృఘ్న సిన్హా హాజరు కాలేదు. ఆయనకు సోనాక్షి వివాహాం ఇష్టం లేదు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో సింపుల్ గా తన బాయ్ ఫ్రెండ్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. జహీర్ ఇక్బాల్ కూడా సినీ నటుడు కావడం విశేషం. వీళ్లిద్దరు కలిసి ‘డబుల్ ఎక్సెల్’ సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమాకు సంబంధించి ఏ ముహూర్తంలో వీళ్లిద్దరు కలిసి నటించారో అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది.

అయితే సోనాక్షి మాత్రం మా పెళ్లికి ఇరు కుటుంబాలకు వారు ఒప్పుకోవడంతో ఒక్కటయ్యామని చెప్పుకొచ్చింది.అంతేకాదు తమకు పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇక పెళ్లి అనే బంధంతో ఒకటైన ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ అనేది కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)

సోనాక్షి సిన్హా కంటే జహీర్ రెండేళ్లు చిన్నవాడు. ప్రస్తుతం సోనాక్షి వయసు 37 యేళ్లు. జహీర్ వయసు 35 సంవత్సరాలు. ఈ ఇయర్ డిసెంబర్ 10వ తేదిన జహీర్ 36వ యేట ప్రవేశించనున్నాడు. ఏది ఏమైనా మతాంతర వివాహాంతో ఒకటైన ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రీసెంట్ గా సోనాక్షి సిన్హా.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరా మండీ’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది.

Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News