Pushpa 2 Updates: పుష్ప 2 లోనూ సమంత.. ఈ సారి కాస్త డిఫరెంట్​గా?

Pushpa 2 Updates: పుష్ప మొదటి భాగం గ్రాండ్​ సక్సెస్​తో.. చిత్ర యూనిట్​ జోరుమీదుంది. దీనితో రెండో భాగం షూటింగ్ సహా ఇతర పనులు చక చకా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. పార్ట్​-2పై  టాలీవుడ్​లో టాక్​ నడుస్తోంది. ఇందులోనూ సమంత కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 12:47 PM IST
  • పుష్ప 2 మూవీపై టాలీవుడ్​లో కొత్త టాక్​
  • మళ్లీ సమంత కనిపించొచ్చని సమాచారం
  • ఓ కీలక రోల్​లో నటించొచ్చని రూమర్స్​!
Pushpa 2 Updates: పుష్ప 2 లోనూ సమంత.. ఈ సారి కాస్త డిఫరెంట్​గా?

Pushpa 2 Updates: అల్లు అర్జున్ నటించిన పాన్​ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'​ (మొదటి భాగం) ఎంతటి హిట్​ కొట్టిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం సహా.. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ మూవీ. ముఖ్యంగా 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిలింగా కూడా పుష్ప-1 నిలిచింది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనతో పాటు.. పాటలు, ఫైట్లకు మంచి మార్కులు పడ్డాయి. అందులో స్టార్ హీరోయిన్​గా దూసుకుపోతున్న సమంత ఇందులో ఐటం సాంగ్​ చేయడం విశేషం. సమంత చేసిన ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్​తో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై 100 రోజులు దాటినా ఈ పాట ఇంకా ట్రెండ్​ అవుతుండటం విశేషం.

అయితే తాజాగా టాలీవుడ్​ వర్గాల్లో కొత్త వార్త వినిపిస్తోంది. పుష్ప ది రూల్​ (పార్ట్​ 2)లో కూడా సమంత కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ సారి ఐటం సాంగ్​తో కాకుండా ఓ రోల్​ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్​ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక పుష్ప-1లో హీరోయిన్​గా నటించిన రష్మికా మందాన్న.. పార్ట్ 2లోను కంటిన్యూ కానున్న విషయం తెలిసిందే.

పుష్ప సినిమా గురించి

శేషాచలం అడవుల్లో గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే చిత్రమే పుష్ప. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్​గా కనిపించారు. సుకుమార్​ దర్శకత్వం వహించిన ఊ మూవీ..  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవి శంకర్​లు నిర్మించారు. 2021 డిసెంబర్​ 17న విడుదలైన ఈ మూవీ మొదటి భాగం రూ.365 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు అంచనాలున్నాయి. రెండో భాగం ఈ ఏడాది చివర్లో గానీ.. 2023 తొలినాళ్లలోగాని విడుదలవనుంది.

Also read: Allu Arjun Car: టాలీవుడ్ సెలెబ్రిటీల కార్లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జరిమానా

Also read: RGV on RRR: ఆర్ఆర్ఆర్, రాజమౌళిపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News