Ram Gopal Varma: రియా చక్రవర్తిపై సినిమా తీయనున్న వర్మ ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV ) నిత్యం వివాదాస్పద అంశాలపై ఓ కన్నేసి పెడతాడు.

Last Updated : Sep 28, 2020, 05:53 PM IST
    • దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV ) నిత్యం వివాదాస్పద అంశాలపై ఓ కన్నేసి పెడతాడు.
    • వాటినే తన సినిమా సబ్జెక్ట్ గా మార్చకుంటాడు.
    • ఎవరూ ఊహించని అంశాలతో మూవీని ప్లాన్ చేసి హైప్ క్రియేట్ చేయడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య.
    • ఇటీవలే వరుసగా సినిమాలు ప్రకటిస్తోన్న ఆర్జీవి గురించి మరో టాక్ వినిపిస్తోంది.
Ram Gopal Varma: రియా చక్రవర్తిపై సినిమా తీయనున్న వర్మ ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV ) నిత్యం వివాదాస్పద అంశాలపై ఓ కన్నేసి పెడతాడు. వాటినే తన సినిమా సబ్జెక్ట్ గా మార్చకుంటాడు. ఎవరూ ఊహించని అంశాలతో మూవీని ప్లాన్ చేసి హైప్ క్రియేట్ చేయడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. ఇటీవలే వరుసగా సినిమాలు ప్రకటిస్తోన్న ఆర్జీవి గురించి మరో టాక్ వినిపిస్తోంది.

ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త

రియాపై సినిమా ?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనావైరస్ తో ( Coronavirus) పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత జరుగుతోన్న పరిణామాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో రియా చక్రవర్తిపై ( Rhea Chakraborty ) రామ్ గోపాల్ వర్మ సినిమా తీయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నబ్ గోస్వామిపై సినిమా తీయడం గురించి ప్రకటించిన వర్మ.. ఇందులోనే రియా పాత్రను చొప్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.

 ALSO READ| Corona Effect: కరోనా కాలంలో భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం

పలు కోణాల్లో...
సుశాంత్ సింగ్ మరణం తరువాత అతని ఆత్మహత్యకు పరోక్షంగా రియానే కారణం అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు కూడా రియాను విచారించి డగ్స్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇదే అంశంపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రముఖ కథానాయికలు కూడా నార్కోటిక్స్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఇంత సెస్సేషన్ అంశంపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినా తీయవచ్చు అంటున్నారు కొంత మంది. అయితే దీనిపై వర్మ మాత్రమే క్లారిటీ ఇవ్వగలడు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News