Ram Charan - Game Changer: రామ్ చరణ్ గేమ్ చేంచర్ రిలీజ్ డేట్ లాక్.. ?

Ram Charan - Game Changer: రామ్ చరణ్ .. రాజమౌళి డైరెక్షన్‌లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినా.. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2024, 03:26 PM IST
Ram Charan - Game Changer: రామ్ చరణ్ గేమ్ చేంచర్ రిలీజ్ డేట్ లాక్.. ?

Ram Charan - Game Changer: శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ చేస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఎపుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా.. కమల్ హాసన్‌తో చేస్తోన్న 'భారతీయుడు 2' కారణంగా లేట్ అవుతోంది. నెలలో కొన్ని రోజులు కమల్ హాసన్‌తో సినిమాను తెరకెక్కిస్తూ.. రామ్ చరణ్‌తో 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు. 

లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేదు. అసలు శంకర్‌తో సినిమా ఒప్పుకొని రామ్ చరణ్ తప్పు చేసాడా అని అభిమానులు ఫీలవుతున్నారు. కానీ శంకర్ కూడా ఓవైపు కమల్ హాసన్ మూవీ చేస్తూనే.. రామ్ చరణ్ మూవీ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. 

దర్శకుడు శంకర్ కూడా ఏది ఒక పట్టానా ఓకే చేయడు. తనకు సంతృప్తి వచ్చే వరకు సీన్స్ మీద సీన్స్ తెరకెక్కిస్తూనే ఉంటాడు. అందుకే ఈ డీలే అని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఓ అప్టేడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 25న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఈ విషయాన్ని రామ్ చరణ్‌ బర్త్ డే రోజున అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. 

'గేమ్ చేంచర్' మూవీని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.

'గేమ్ ఛేంజర్' మూవీ తర్వాత రామ్ చరణ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో రామ్ చరణ్‌ సరసన  జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. 

Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News