Rajinikanth: బాలీవుడ్ క్రేజీ దర్శక, నిర్మాతతో రజినీకాంత్ నెక్ట్స్ మూవీ.. అఫిషియల్ ప్రకటన..

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ జైలర్ మూవీతో వపర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో చేసిన 'లాల్ సలాం' మూవీతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు.  ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నీ తలైవా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2024, 08:27 AM IST
Rajinikanth: బాలీవుడ్ క్రేజీ దర్శక, నిర్మాతతో రజినీకాంత్ నెక్ట్స్ మూవీ.. అఫిషియల్ ప్రకటన..

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా తన కూతురు దర్శకత్వంలో చేసిన 'లాల్ సలాం' మూవీతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ డిజాస్టర్  అనే కంటే ఘోర అవమానం పాలయ్యారు రజినీకాంత్. ఈ సినిమాకు కనీసం పోస్టర్ ఖర్చులు  రాకపోగా.. నెగిటివ్ షేర్ తెచ్చుకున్న సినిమాగా రజినీకాంత్ కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఏది ఏమైనా 5 దశాబ్దాలకు పైగా లెగసీ ఉన్న రజినీకాంత్ లాంటి హీరోకు ఇది ఒక రకంగా ఘోర అవమానమే అని చెప్పాలి.

ప్రస్తుతం రజినీకాంత్.. టి.ఈ. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఓ మూవీ ఓకే చేసాడు. ఇదే తన చివరి సినిమా అని చెప్పాడు. కానీ తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతైన సాజిద్ నడియావాలాతో ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్.. వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసారు. రజినీకాంత్ నివాసంలో సాజిద్ మర్యాద పూర్వకంగా కలిసిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాజిద్ నడియావాలా బాలీవుడ్ అగ్ర నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అంతేకాదు సల్మాన్ ఖాన్‌తో 'కిక్' మూవీతో డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకున్నారు. ఈయన ఎక్కువగా బాలీవుడ్ హీరోలతోనే ఇప్పటి వరకు  సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఇపుడు తొలిసారి దక్షిణాది హీరో అయిన రజినీకాంత్‌తో సినిమా నిర్మిస్తున్నట్టు పేర్కొనడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈయన రజినీకాంత్‌, లోకేష్ కనగరాజ్ కాంబోకు నిర్మాతగా వ్యవహరిస్తారా.. లేదా మరో దర్శకుడితో రజినీతో సినిమా చేస్తాడా అనేది వెయిట్ అండ్ సీ.

Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News