Nagarjuna: నా పేరుతో వస్తున్న ఆ వార్తల్లో నిజం లేదు: నాగార్జున

Nagarjuna: సమంత, నాగ చైతన్యల గురించి తన పేరుతో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు నాగార్జున. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 08:15 PM IST
  • తన పేరుతో వస్తున్న వార్తలపై నాగార్జున క్లారిటీ
  • తాను ఎలాంటి వివరాలు వెల్లడించలేదని స్పష్టం
  • సోషల్​ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రకటన
Nagarjuna: నా పేరుతో వస్తున్న ఆ వార్తల్లో నిజం లేదు: నాగార్జున

Nagarjuna: సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులపై స్పందించినట్లు.. తన పేరుతో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవాళ తన పేరుతో వచ్చిన ఆ వార్తలన్ని తప్పుడు (Samantha Naga chaitanya divorce) వార్తలు, అసంబద్ధమైనవి పేర్కొన్నారు.

'రూమర్లను న్యూస్​గా పోస్ట్​ చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నా' అంటూ ట్వీట్​ చేశారు నాగార్జున. GiveNewsNotRumours అనే హ్యాష్​ ట్యాగ్​ను కూడా జోడించారు.

అసలేమైందంటే...?

టాలీవుడ్ లవ్ కపుల్​ నాగచైతన్య, సమంత (Naga chaitanya and samantha) గతేడాది అక్టోబరులో విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. ఈ ప్రకటన తర్వాత వారు విడిపోవడానికి కారణమిదేనంటూ అనేక వార్తలొచ్చాయి. అయితే దీనిపై నాగచైతన్య, సమంత ఎప్పుడూ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

నాగార్జున కూడా వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారే గానీ.. వారు విడిపోవడానికి కారణాలపై మాట్లాడలేదు. అయితే తాజాగా నాగార్జున ఈ విషయంపై స్పందించాలని వార్తలు వచ్చాయి.

'సమంతనే ముందుగా విడిపోవాలని కోరుకుందని.. నాగ చైతన్య సమంత నిర్ణయాన్ని గౌరవించాడని నాగార్జున చెప్పారు.' అనేది తాజా వార్తల (Nagarjuna on Naga chaitanya Samantha divorce) సారాంశం.

నేడు ఈ వార్త వైరల్​గా మారడంతో.. నాగార్జున ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటన చేశారు. తాను ఎలాంటి విషయాలు వెల్లడించలేదని క్లారిటీ ఇచ్చారు.

Also read: Shruti Hassan Photos: ప్రకృతిలో సలార్ భామ శ్రుతిహాసన్ ఫొటోషూట్

Also read: Akhanda Dubbed Release Date: మరో నాలుగు భాషల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన అఖండ మూవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News