Mohan Babu Audio: నేను కొట్టింది తప్పే.. మోహన్ బాబు మరో సంచలన ఆడియో రిలీజ్

Actor Mohan Babu Audio Clip: మీడియాపై  దాడి చేయడం తప్పేనని.. కానీ తాను ఎలాంటి పరిస్థితుల్లో కొట్టానో ప్రజలు ఆలోచించాలని నటుడు మోహన్ బాబు కోరారు. మరో ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసిన ఆయన.. తమ సమస్యను తామే సర్దుబాటు చేసుకుంటామన్నారు. కుటుంబ సమస్యల్లో ఇతరులు జోక్యం చేసుకోవచ్చా..? అని ఆయన ప్రశ్నించారు.

Written by - Ashok Krindinti | Last Updated : Dec 12, 2024, 06:42 PM IST
Mohan Babu Audio: నేను కొట్టింది తప్పే.. మోహన్ బాబు మరో సంచలన ఆడియో రిలీజ్

Actor Mohan Babu Audio Clip: డైలాగ్ కింగ్, నిర్మాత మోహన్ బాబు తాజాగా మరో ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేశారు. దైవసాక్షిగా తాన జర్నటిస్ట్‌ను కొట్టాలని అనుకోలేదని.. తన ఇంట్లోకి వస్తున్నది జర్నటిస్టులా..? కాదా..? అనే విషయం తనకు తెలియదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని దాడి చేస్తున్నారేమోనని అనుకున్నానని.. జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు తెలిపారు. "తెలుగు ప్రజలకి నమస్కారం. గత నాలుగు రోజులుగా జరుగుతున్నది అందరికీ తెలుసు.. సీఎంలకు కూడా తెలుసు అనుకుంటున్నా.. నా హృదయంలో ఉండే ఆవేదన ఏంటంటే.. కుంటుంబ సమస్యల్లో పర్మిషన్ లేకుండా ఇతరుల జోక్యం చేసుకోవచ్చా..? ఆలోచించండి..? పాపులర్ వ్యక్తుల విషయంలో ఉన్నవీలేనివీ చెబుతాంటారు. అందరూ ఆలోచించాలి

ప్రజలకు అన్నీ తెలుసు.. ఎవరి పని వారు చేసుకుంటారు. మీడియా, సోషల్ మీడియాలో విజువల్స్ వస్తున్నాయి. రాత్రి నా కొడుకు మనోజ్ గేటు తోస్కుని వచ్చాడు. మీడియా సోదరులు.. నా ఇంటి ముందు నాలుగు రోజుల నుంచి ఉన్నారు. లైవ్ వ్యాన్స్ పెట్టుకుని ఉన్నారు. ముందే చెప్పాను మీడియాతో.. నా సమస్యను నేను పరిష్కరించుకుంటా అని చెప్పా. రాజ్యసభ నుంచి క్లీన్ పర్సన్‌గా వచ్చాను. మీడియా సోదరులు నెగిటివ్‌గా చెబుతున్నారు. రాత్రులు గేటు తోస్కుని, పర్మిషన్ లేకుండా రావడం ఏంటి..? అందరూ మీడియా సోదరులా..? చేతిలో మైక్ పట్టుకుని, పగ ఉన్న వ్యక్తులు వచ్చారా..? నాకు డౌటు ఉంది. చెప్పినా వినకుండా వచ్చారు. 

నమష్కారం పెట్టాను. మైక్ తీసుకువచ్చి నోట్లో పెట్టారు. కంటి కింద తగిలింది.. నా కన్ను పోయేది. చీకట్లో ఘర్షణ జరిగింది. దెబ్బ తగిలింది అన్నారు. అతనూ నాకు తమ్ముడే.. బాధగానే ఉంది నాకు. అతని భార్య ఎంత బాధపడుతుందో.. పిల్లలు ఎంత బాధపడుతున్నారో ఆలోస్తున్నాను. సినిమాల్లో నటిస్తానే తప్ప.. నిజ జీవితంలో నటించలేను. నీతిగా, ధర్మంగా బతకాలన్నది నా ధర్మం. గేటు బయట నేను కొట్టి ఉంటే నాదే తప్పు.. అప్పుడు నన్ను అరెస్ట్ చేసినా తప్పులేదు. ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను భగ్నం చేసారు

ఏదో రోజు న్యాయం జరుగుతుంది.. నా కొడుక్కి నాకు. మేము సర్దుబాటు చేసుకుంంటాం.. మాకు బయటి వ్యక్తులు అవసరం లేదు. కట్టు బట్టలతో చెన్నై వెళ్లాను.. కష్టపడ్డాను. 25 శాతం ఫ్రీ సీట్లు ఇచ్చి.. విద్యాసంస్థలు నడుపుతున్నాను. ప్రజా ప్రతినిధులారా.. అభిమానులారా..? ఆలోచించండి. కొట్టింది తప్పే.. కానీ ఏ సందర్భంలో కొట్టాననేది ఆలోచించండి. ఇంట్లోకి వచ్చి దూరితే.. కోపం రాదా..? 
చెప్పండి.. మీకు టీవిలు ఉన్నాయి.. మాకు టీవీలు లేవు.. రేపు పెట్టొచ్చు

అతనికి దెబ్బ తాకింది.. చింతిస్తున్నాను. నిజంగా జర్నలిస్ట్ నా కాదా అనేది నాకు ఎలా తెలుస్తుంది..? యే ఛానల్..? టీవి9నా..? అనేది నేను చూడలేదు. రజనీకాంత్.. చాలా సందర్భాలలో నాతో మాట్లాడారు.. భగవంతుడు చూస్తున్నాడు. పోలీసులంటే ఇష్టం.. వారు నాకు ఇష్టం.. రక్షణ కల్పిస్తున్నారు. నా సంస్థల నుంచి వచ్చిన వారు బాగా సెటిల్ అయ్యారు. ఏకపక్ష నిర్ణయం ఏంటి..? ప్రజలారా ఆలోచించండి..? నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా..? మీరే ఆలోచించండి.." అని మోహన్ బాబు కోరారు.

Also Read: Fairness Cream: తిక్క కుదిరింది.. ఓ 15ఏళ్ల బాలుడి దెబ్బకు ఆ ఫెయిర్‌నెస్‌ కంపెనీ రూ.15 లక్షలు చెల్లించుకుంది!  

Also Read: Klinkara: చూస్తూ ఉండగానే పెరిగిపోయింది.. క్లీంకారా ఇప్పుడు ఎలా ఉందో ఫొటో చూడండి!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News