Manchu Manoj: మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ భారీ ర్యాలీ నిర్వహించుకుంటూ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ కాలేజ్ గేట్లు మూసేసి పోలీస్ బలగాల నియమించినట్లు సమాచారం.
Mohan Babu: మోహన్ బాబు తన కుటుంబ గొడవలు రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే కదా. చిన్న కుమారుడు మంచు మనోజ్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో మోహన్ బాబు ప్రముఖ టీవీ జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆయన పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ కేసులో బెయిల్ కోసం మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. తాజాగా అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది.
Mohan Babu Arrest: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక దాని వెనక మరొక సంఘటలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్.. బెయిల్ పై విడుదల.. మళ్లీ విచారణ అంటూ బన్నిని పోలీస్ స్టేషన్స్ చుట్టు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది.
Mohan Babu Arrest: టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ నిర్మాత మంచు మోహన్ బాబుకు రాచకొండ పోలీస్ కమిషనర్ బిగ్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో జరిగిన అంతర్గత కలహాల కారణంగా సమాజంలో కొంత అశాంతిని క్రియేట్ చేసిన నేపథ్యలో మోహన్ బాబు ఫ్యామిలీపై 3 FIR లను నమోదు చేసినట్టు రాచకొండ సీపీ తెలిపారు.
Manchu Family: మంచు ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా మంచు సోదరుల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. తాజాగా మంచు సోదరుల్లో చిన్నవాడైన మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనికా రెడ్డి ఇద్దరు త్వరలో పవన్ కళ్యాన్ కు చెందిన జనసేన పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం.
Manchu Manoj: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ ఇష్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అన్ని ఇష్యూస్ ను పక్కన నెట్టి వీరి ఇంటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. అంతేకాదు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే ఉద్దేశ్యంతో వారి అనుమతి లేకుండా వారి ఇంట్లో ప్రవేశించిన మీడియాపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇష్యూ కాస్త సద్దుమనిగాక ..తాజాగా మంచు మనోజ్ మందేసి చిందేసి హంగామా చేసారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Actor Mohan Babu Audio Clip: మీడియాపై దాడి చేయడం తప్పేనని.. కానీ తాను ఎలాంటి పరిస్థితుల్లో కొట్టానో ప్రజలు ఆలోచించాలని నటుడు మోహన్ బాబు కోరారు. మరో ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసిన ఆయన.. తమ సమస్యను తామే సర్దుబాటు చేసుకుంటామన్నారు. కుటుంబ సమస్యల్లో ఇతరులు జోక్యం చేసుకోవచ్చా..? అని ఆయన ప్రశ్నించారు.
Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రజలు కూడా ఈ వీరి కుటుంబంలో జరగుతున్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. మరోవైపు మంచు ఫ్యామిలీ పెద్ద మోహన్ బాబు మీడియాపై దాడికి దిగడం పెద్ద సంచలన అయింది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ.. మంచు సోదరులకు పిలిచి వార్నింగ్ ఇచ్చారు.
Mohan Babu Networth: వందల సినిమాల్లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి ఎన్నో వందల చిత్రాల్లో తన నటనతో మెప్పించారు మోహన్ బాబు. తన డైలాగ్స్‌తో టాలీవుడ్లో డైలాగ్ కింగ్‌గా.. సినిమాల కలెక్షన్స్‌తో కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆయన సక్సెస్ అయ్యారు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్న ఈ గ్రేట్ యాక్టర్ ఫ్యామిలీలో గొడవలు అభిమానులకు రుచించడం లేదు. చిన్న కొడుకు మంచు మనోజ్‌తో వివాదంతో మోహన్ బాబు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్తుల వ్యవహారమే గొడవలకు కారణమైనట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి..? ఎవరికి ఎంత వాటా ఇచ్చారు..? ఇక్కడ తెలుసుకుందాం
Mohan Babu Jalpally Farm House Pics: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఘర్షణ.. మధ్యలో మీడియా ప్రతినిధులపై దాడి.. హైబీపీతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలు అన్నింటికి కేంద్రంగా నిలిచింది జల్పల్లి ఫామ్ హౌస్. దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం.. అన్ని హంగులతో నిర్మించినట్లు తెలుస్తోంది.
Mohan Babu Controversy: అసెంబ్లీ రైడీ, పొలిటికల్ రౌడీ, ఆ తర్వాత రౌడీ.. వరుసగా రౌడీ సినిమాల్లో టైటిల్ రోల్స్ పోషిండము. అంతేకాదు హీరోగా స్టార్ డమ్ రాకముందు చాలా సినిమాల్లో మోహన్ బాబు రౌడీ తరహా పాత్రల్లో నటించడం కాబోలు.. ఇపుడు నిజ జీవితంలోను రౌడీలా ప్రవర్తిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తన చిన్న కుమారుడుతో పాటు మీడియాపై ఆయన వ్యవహరించిన తీరుతో మరోసారి మోహన్ బాబు తీరు చర్చనీయాంశంగా మారాయి.
Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి.ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు రావాలని సీపీ ఆదేశించారు. మరోవైపు మోహన్ బాబుకు తలకు గాయం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
Manoj Vs Vishnu : ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు.. మంచు కుటుంబంలో విభేదాలతో వాళ్ల ఫ్యామిలీ పరువు రచ్చ కెక్కింది. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు ఫ్యామిలీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా లావాలా విరజిమ్మాయి. అంతేకాదు తండ్రీ కొడుకులైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. తాజాగా మంచు విష్ణు తాజాగా ఎంట్రీ ఇవ్వడంతో మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది.
Manchu Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ వివాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇప్పటికే నందమూరి కుటుంబంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సెలెంట వార్.... మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు కుటుంబం రచ్చ.. అటు వైయస్ఆర్ కుటుంబంలో అన్నా చెల్లెల్లు ఆస్తుల కోసం వీధి ఎక్కడం మరిచిపోకముందే తాజాగా మంచు కుటుంబంలో ఏకంగా తండ్రి తనయుల మధ్య గొడవ తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
Manchu Manoj Complaints Against Mohan Babu: తన భార్యపై, తనపై మోహన్ బాబు దాడి చేశాడని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గాయాలతో స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మంచు ఆఫీస్ టీమ్ చెబుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.