Karishma Tanna Dance: సమంత సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన కొత్త పెళ్లి కూతురు, నటి కరిష్మా తన్నా

Karishma Tanna Dance Viral Video : ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ నటి కరిష్మా తన్నా పేర్లతో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కరిష్మా తన్నా.. తన పెళ్లిలో ఊ అంటావా మావా పాటకు వేసిన డ్యాన్స్‌ కిర్రాక్‌గా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 05:26 PM IST
  • సోషల్ మీడియాలో ట్రెండ్‌ సెట్టర్‌‌గా మారిన పుష్ప సాంగ్స్‌, డైలాగ్స్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతోన్న రీల్స్‌
  • ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా
    పాటకు అదిరిపోతోన్న డ్యాన్స్‌లు
  • బాలీవుడ్‌ నటి కరిష్మా తన్నా చేసిన డ్యాన్స్‌ వైరల్
Karishma Tanna Dance: సమంత సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన కొత్త పెళ్లి కూతురు, నటి కరిష్మా తన్నా

Karishma Tanna Dances to Samantha Ruth Prabhu's Song: ఇటీవల రిలీజైన అల్లు అర్జున్‌ పుష్ప మూవీ మంచి కలెక్షన్స్‌ వసూలు చేయడమే కాదు.. సోషల్ మీడియాలో ట్రెండ్‌ సెట్టర్‌‌గా మారింది. గతేడాది డిసెంబర్‌ 17న రిలీజైన ఈ సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) రీల్స్‌ చాలానే వచ్చాయి. అంతేకాదు పుష్ప మూవీలోని (Pushpa Movie) పాటలకు సెలబ్రిటీలతో పాటు యూత్ మొత్తం డ్యాన్స్‌లు అదరగొట్టేస్తున్నారు. పెళ్లిళ్లలో, ఫంక్షన్‌లలో పుష్ప మూవీలోనే పాటలే మారుమోగిపోతున్నాయి. 

ఇక పుష్ప మూవీతో సమంత ఫస్ట్‌ టైమ్‌ ఒక ఐటెమ్‌ సాంగ్‌లో నటించి అదరగొట్టేసింది. సోషల్‌ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా కూడా ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా పాటనే మోగిపోతోంది. 

యూత్‌ మాత్రమే కాదు ఏ పెళ్లిలో చూసినా కొత్త వధూవరులు ఈ పాటకే డ్యాన్స్‌లు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. అలాంటి డ్యాన్స్‌ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాను దున్నేస్తున్నాయి.

తాజాగా ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా సాంగ్‌కు కొత్తగా పెళ్లయిన బాలీవుడ్‌ నటి కరిష్మా తన్నా డ్యాన్స్‌ వేసి అదరగొట్టేసింది. కరిష్మా తన్నా వివాహం బిజినెస్‌మేన్‌ వరుణ్ బంగేరాతో తాజాగా జరిగింది. పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్‌ వేడుకలో కరిష్మా తన్నా ఊ అంటావా మావా.. ఊహు అంటావా (Oo Antava Song) హిందీ పాటకు డ్యాన్స్‌ చేసి ఫుల్‌ ఎంజాయ్ చేసింది.

దీంతో సమంత రూత్ ప్రభు.. (Samantha Ruth Prabhu) కరిష్మా తన్నా (Karishma Tanna) హ్యాష్‌ట్యాగ్‌లతో కరిష్మా తన్నా చేసిన డ్యాన్స్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డ్‌ కలర్‌‌ డ్రెస్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో ఈ అమ్మడు డ్యాన్స్ ఇరగదీసింది.

 

సీరియల్‌ నటిగా తన కెరీర్‌‌ను స్టార్ట్‌ చేసిన కరిష్మా తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 'క్యుకి సాస్ భీ కభీ బహు థీ,' 'నాగిన్ 3,' 'గ్రాండ్ మస్తీ' తదితర మూవీల్లో నటిచింది. అలాగే 'ఖత్రోన్ కే ఖిలాడీ' సీజన్‌ 10లో కూడా పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచింది. ఇక కరిష్మా తన్నా డ్యాన్స్‌ వీడియో (Dance‌ Video) ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ (Viral) అవుతోంది. ఆమె డ్యాన్స్‌కు (Dance) ఫిదా అవుతోన్న నెటిజెన్స్‌ (Netizens‌) తెగ మెచ్చుకుంటున్నారు. 

Also Read: Messages Recovery Android: మొబైల్ లో డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందవచ్చు!

Also Read: Srivalli English song: శ్రీ వల్లి తెలుగు పాటకు ఇంగ్లీష్​ వర్షన్ విన్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News