IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా

IT Raids on Mythri మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దృష్టి పెట్టేసింది. మైత్రీ మూవీస్ ఈ మధ్య భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలు నిర్మించినా అవి అంతగా క్లిక్ అవ్వడం లేదు. ఈ సంక్రాంతికి మైత్రీ హవా చూపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 11:47 AM IST
  • టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ కలకలం
  • రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు
  • మైత్రిలో విదేశీ నిధులపై ఆరా
IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా

IT Raids on Mythri మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న మొదలైన ఈ ఐటీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. సుకుమార్ ఇంట్లో, సుకుమార్ ఆఫీస్‌లు, మైత్రీ ఆఫీస్‌లో నిన్న అంతా కూడా సోదాలు జరిగాయి. దీంతో నిన్న పుష్ప సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి హడావిడిగా హైద్రాబాద్‌కు వచ్చాడని తెలుస్తోంది. ఐటీ రైడ్స్ నేపథ్యంలో ఇలా సుకుమార్ తన సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది.

మైత్రీ ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి రెండు సినిమాలను దించి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు మైత్రీ నిర్మించింది. ఈ రెంటిని ఒకే సారి సంక్రాంతికి బరిలోకి దించింది. ఈ రెండు సినిమాలతో మైత్రీ లాభపడినట్టు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా వాల్తేరు వీరయ్య అయితే ఏకంగా రెండు వందల కోట్ల గ్రాస్‌ను రాబట్టేసింది. వీర సింహా రెడ్డి కలెక్షన్ల విషయంలో మైత్రీ ఇష్టానుసారంగా వ్యవహరించిందనే టాక్ ఉంది. వీర సింహా రెడ్డి ఫేక్ కలెక్షన్ల మీద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సరైన లెక్కలను ఐటీ అధికారులు కోరినట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప సినిమా బడ్జెట్ విషయం, విదేశాల నుంచి వచ్చిన వందల కోట్ల మీద లెక్కలను ఐటీ అధికారులు అడిగినట్టు సమాచారం అందుతోంది.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

మొత్తానికి మైత్రీ మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా ఐటీ దాడులు జరుగుతుండటం, ఇది కావాలనే చేస్తున్నారా? లేదంటే రెగ్యులర్‌గా జరిగే ఐటీ రైడ్స్ వంటిదేనా? అన్నది తెలియడం లేదు. జీఎస్టీ ఎగ్గొట్టడంతోనే ఇలా ఐటీ దాడులు చేశారనే మరో టాక్ కూడా ఉంది.

Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News