Hanu Man: హనుమాన్ మూవీ మరో బిగ్ అఛీవ్‌మెంట్.. ఇది మాములు లెక్క కాదుగా..

Hanu Man:హను మాన్ సినిమా ప్రభంజనం ఆగడం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను మడత పెట్టేసింది. ఈ మూవీ తాజాగా తాన ఖాతాలో మరో రికార్డును నమోదు అయింది.  

Last Updated : Feb 12, 2024, 08:50 AM IST
Hanu Man: హనుమాన్ మూవీ మరో బిగ్ అఛీవ్‌మెంట్.. ఇది మాములు లెక్క కాదుగా..

Hanu Man: హను మాన్ ఈ పేరు చాలు.. అన్ని రికార్డులు మటు మాయం కావడానికి. అవును హనుమాన్ పేరుతోనే ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ మూవీ విడుదలకు ప్రీమియన్స్ ద్వారానే అద్బుతమైన టాక్ సొంతం చేసుకొని పొంగల్ విన్నర్‌గా నిలిచింది. 2024లో హనుమాన్ సినిమా మన దేశంతో పాటు తెలుగులో ఫస్ట్ హిట్‌గా నిలిచింది.ఈ మూవీ గురించి ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా ఎంతో శ్రమించాడు. విడుదల సమయంలో సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. అయినా.. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచి గెలిచింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి చిత్రాల్లో హైయ్యెస్ట్‌ గ్రాసర్‌గా తెలుగు సినీ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది.

ఇక బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కొనసాగుతూనే వస్తోంది. రిలీజ్‌కు ఒక రోజు ముందు ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో  సరికొత్త బెంచ్ మార్క్   క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు అమెరికా బాక్సాఫీస్ దగ్గర $ 5 మిలియన్ యూఎస్ డాలర్స్  కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది. అంతేకాదు మీడియం అండ్ స్మాల్ రేంజ్ చిత్రాల్లో హనుమాన్ మూవీది సరికొత్త రికార్డు. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 30 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. అది కూడా 300 సెంటర్స్‌లో ఈ సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్ కావడం శుభపరిణామం. ఇక ఈ సినిమా హిందీలో దాదాపు రూ. 50 కోట్ల నెట్ వసూళ్లు.. రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సంక్రాంతి గట్టిపోటీలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'గుంటూరు కారం" సినిమా ఉన్న ఆ సినిమాతో పోటీని తట్టుకొని నిలబడింది. అంతేకాదు ఆ సినిమాను వెనక్కి నెట్టేసింది హనుమాన్. ఈ సినిమాకు హనుమాన్ పేరే పెద్ద బ్రాండ్.  తొలి రోజు ముందు నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రారంభమైన హనుమాన్ దూకుడు నెల రోజులైన తగ్గడం లేదు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 152 కోట్ల షేర్ ( రూ. 300 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

రూ. 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ.125 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి టాలీవుడ్‌లో మరే బిగ్ హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పింది. గత కొన్నేళ్గుగా ఓ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో ఈ మూవీ థియేట్రికల్‌గా రూ. 125 కోట్ల లాభాలను ఆర్జించడం మాములు ఊచకోత కాదు. ఇదో రేర్ ఆఫ్ ది రేర్ అని చెప్పాలి.

మరోవైపు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రూపేణా..మరో రూ. 50 కోట్ల అదనపు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరిగిన ఈ శుభవేళలో హను మాన్ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ  చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే రిలీజైంది. త్వరలో మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజెస్ లోనూ విడుదల  చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా భాషలకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, గెటప్ శ్రీను ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం "విజువల్ ఫీస్ట్"గా నీరాజనాలు అందుకుంటోంది.

ఆ సంగతి పక్కన పెడితే.. హనుమాన్ మూవీ క్లైమాక్స్‌లో ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అయోధ్య భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువైన శుభవేళలో ప్రకటించాడు దర్శకుడు. ఈ మూవీలో రానా ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు చిరంజీవి, మహేష్ బాబులు హనుమాన్, శ్రీరాముడి పాత్రల్లో  ఈ చిత్రంలో నటిస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ  చెప్పాడు. ఆయన మనసులోని మాటను ఈ హీరోలు పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి. మొత్తంగా 'హనుమాన్'మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపిన ప్రశాంత్ వర్మ.. రాబోయే 'జై హనుమాన్' మూవీతో ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తాడో చూడాలి.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News