Vijay Devarakonda Liger : విజయ్‌ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. వాటిపై కూపీ లాగే ప్రయత్నం?

Vijay Devarakonda Liger విజయ్ దేవరకొండను తాజాగా ఈడీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. లైగర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ ఈ మేరకు యూనిట్‌ను విచారిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 05:15 PM IST
  • లైగర్ చుట్టూ ఈడీ అధికారుల కన్ను
  • పూరి, ఛార్మీలను విచారించిన ఈడీ
  • విజయ్ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ
Vijay Devarakonda Liger : విజయ్‌ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. వాటిపై కూపీ లాగే ప్రయత్నం?

ED Questioned Vijay Devarakonda : లైగర్ సినిమా ఫ్లాప్ అయి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లను చీకట్లోకి నెట్టేసింది. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బెడిసి కొట్టిన బాధలో పూరి, విజయ్ ఉంటే.. ఇప్పుడు వారి చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. లైగర్ సినిమాకు టీఆర్ఎస్ నాయకుల పెట్టుబడి ఉందంటూ కాంగ్రెస్ లీడర్ చేసిన ఈ ఫిర్యాదుతో ఈడీ ఇలా విరుచుకుపడుతోంది. రెండు వారాల క్రితం పూరి, ఛార్మీలను ఈడీ విచారించింది.

లైగర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని, లైగర్ పెట్టుబడికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించండని పూరి, ఛార్మిని ఈడీ అధికారులు కోరారు. అయితే నేడు విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి రప్పించుకున్నారు. విజయ్‌ను ప్రశ్నలతో ముంచెత్తారు. విజయ్ ఇలా ఈడీ ముందుకు హాజరవ్వడంతో హాట్ టాపిక్‌గా మారింది. పూరి, ఛార్మీలకైతే ఇలా ఈడీల వ్యవహారం కొత్తేమీ కాదు. డ్రగ్స్ వ్యవహారంలో ఇది వరకే పూరి, చార్మీలు అక్కడి వ్యవహారాలు అలవాటయ్యాయి.

కానీ విజయ్ దేవరకొండకు మాత్రం ఇది మొదటి సారి. అయితే ఈడీ అధికారులు మాత్రం విజయ్‌ను తన రెమ్యూనరేషన్ విషయంలో గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఎంత తీసుకున్నావ్? ఏ రూపంలో ఇచ్చారు.. చేతికి ఇచ్చారా? చెక్ రూపంలో ఇచ్చారా? ఇలా నానా రకాలుగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. వాటికి విజయ్ సరైన సమాధానాలే ఇచ్చినట్టు సమాచారం అందుతోంది.

విజయ్ ప్రస్తుతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సమంతకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖుషీ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది. దీంతో విజయ్‌కు ఇప్పటికిప్పుడు సినిమా చేసేందుకు మరో దర్శకుడు దొరకడం లేదు. సుకుమార్‌ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరితో విజయ్ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : Mehreen Pirzada Face : మెహరీన్ మొహానికి ఏమైంది.. ఆ వైద్యాన్ని ఎందుకు ఎంచుకుంది?

Also Read : Veera Simha Reddy : సెట్‌లో బాలయ్య ఆగ్రహం.. దెబ్బకు డుమ్మా కొట్టేశాడట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News