Chiranjeevi - Pawan Kalyan - Trisha: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా భేటి కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదారాబాద్‌లో ప్రత్యకంగా వేసిన 'విశ్వంభర' షూటింగ్ సెట్‌లో అన్నయ్యను మరో అన్నయ్య నాగబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి.. పవన్ కళ్యాణ్ .. జనసేన పార్టీకి తన వంతుగా రూ. 5 కోట్ల విరాళం అందజేసారు. అంతేకాదు జనసేనకు తన మద్ధతు తెలిపార. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసిన దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. మరోవైపు త్రిష.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల చిరంజీవి లుక్ చూస్తే మరో 20 యేళ్లు తగ్గినట్టు కనిపిస్తోంది.
స్టాలిన్ మూవీ తర్వాత చాలా యేళ్లకు త్రిష..మరోసారి చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మరోవైపు త్రిష.. పవన్ కళ్యాణ్ సరసన 'తీన్‌మార్' మూవీలో జోడిగా నటించింది. అంతకు ముందు బంగారం సినిమాలో కాసేపు అలా మెరిసింది.
త్రిష విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన 'వర్షం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఈ మూవీ తర్వాత త్రిష వెనుదిరిగి చూసుకోలేదు. ఇక వర్షం తర్వాత 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, అతడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఇక నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకుంది.
తెలుగులో దాదాపు సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా అందరి అగ్ర హీరోల సరసన నటించింది. నటిగా ఈమె మొదటి చిత్రం ప్రశాంత్, సిమ్రాన్ హీరో, హీరయిన్స్‌గా నటించిన 'జోడి'. ఈ మూవీలో చిన్న పాత్రలో నటించింది త్రిష. అంతకు ముందు 1999లో మిస్ చెన్నైగా సెలెక్ట్ అయింది. 2001లో మిస్ ఇండియా స్మైల్‌గా నిలిచింది. త్రిష ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలోనే జరిగింది. ఎతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసింది త్రిష.
1999లో మిస్ చెన్నైగా ఎంపికైంది. 2001లో మిస్ ఇండియా స్మైల్‌గా ఎంపికైంది. త్రిష విద్యాభ్యాసం చెన్నైలోని జరిగింది. ఎతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసిన త్రిష. అంతేకాదు క్రిమినల్‌లో సైకాలజీ చేసింది. తమిళంలో మొదటి సినిమా 'మౌనం పేసియదే'. ఇక హిందీలో అక్షయ్ కుమార్‌తో కలిసి 'కట్టా మీటా' మూవీలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. గతేడాది 'పొన్నియన్ సెల్వన్' మూవీలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో త్రిష మళ్లీ కథానాయికగా సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి.
Also Read: Revanth Reddy Flight: రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter