Brahmamudi: రుద్రాణీ నోట్లో మట్టికొట్టిన పెద్దాయన.. కోర్టుకు ఈడుస్తానని రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి..

Brahmamudi Today December 11 Episode: రుద్రాణీ, రాహుల్‌లు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే పనిలో ఉంటారు. తాతయ్యను ఎదిరించి నిలబడింది ఆఫ్ట్రాల్‌ రాజ్‌కు భయపడుతుందా? అని రెచ్చగొడతాడు రాహుల్‌. ఇపుడేంటి రూ.2 కోట్లు చెక్‌పై రాజ్‌ చేత సంతకం పెట్టించాలి అంతేకదా? అంటుంది ధాన్యం. మాటలు చెబుతుంది కానీ, వెళ్లి అడిగే ధైర్యం మాత్రం చేయదు అంటుంది రుద్రాణీ. దీంతో చెక్‌ లాక్కొని రాజ్‌ వద్దకు వెళ్తుంది. 

Written by - Renuka Godugu | Last Updated : Dec 11, 2024, 09:36 AM IST
Brahmamudi: రుద్రాణీ నోట్లో మట్టికొట్టిన పెద్దాయన.. కోర్టుకు ఈడుస్తానని రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి..

Brahmamudi Today December 11 Episode: హాల్‌లో రాజ్‌, ప్రకాశం, రాజ్‌ నాన్న కూర్చొని ఉంటారు. చెక్‌ చూపించి రాహుల్‌కి కావాలి సంతకం బిజినెస్‌ పెట్టుకుంటాడు అంటుంది. రాజ్‌ నాన్న అసమర్థులను పెంచి పోషించడం మా వల్ల కాదమ్మ అంటాడు. తిండి పెట్టడమే ఎక్కువ అంటాడు. ఒకసారి అవకాశమిస్తే కదా నిరూపించుకునేది అంటుంది రుద్రాణీ. బిజినెస్‌ అంటే ఛాంబర్‌లో కూర్చొని అందరి మీద అజమాయిషీ చూపించడం కాదు అంటాడు.

అది విషయం ధాన్యలక్ష్మి ఈ ఇంట్లో నాకు మాత్రమే కాదు నీమాటకు విలువలేదు. నువ్వు ఊరేసుకున్న వీళ్లు పట్టించుకోని డబ్బు మనుషులు అంటుంది. నీ నోరు సరిపోదని వేరే నోరు అరువు తెచ్చుకున్నావా? అంటుంది అపర్ణ. రెండు కోట్లు నువ్వు, కల్యాణ్‌ అడిగితే ఇచ్చేవాడిని రాహుల్‌కు కాదు. మరింత చెడుపోతాడు అపాత్రదానం అవుతుంది అంటాడు రాజ్‌. కేవలం నీ మాట నెగ్గించుకోవడానికి నిన్ను తీసుకువచ్చింది అంటుంది అపర్ణ.

అవును రుద్రాణీ చెప్పింది. ఇప్పుడు పంతానికి పోయి అడుగుతాను. ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నా వాట నాకు పంచండి అంటుంది ధాన్యలక్ష్మి. ఈ గొడవ లేవనెత్తినందుకే మా నాన్న ఆసుపత్రి పాలయ్యాడు అంటాడు రాజ్‌ నాన్న. శభాష్‌.. అన్నయ్య నాన్న తిరిగి రాకపోతే అంటుంది రుద్రాణీ.. అప్పుడే ఇందిరా దేవి రుద్రాణీ చెంపచెల్లు మనిపిస్తుంది. ఏం కూశావే... నువ్వు అసలు మనిషివేనా? ఈ ఇంటి ఉప్పు తిని ఇవ్వాలా ఈ ఇంటి చావును కోరుకుంటున్నావా? పెద్దమనిషి ప్రాణాలతో పోరాడుతుంటే తిరిగి రాడు అంటావా? అని నిలదీస్తుంది.

అస్సలు నాన్న నిన్ను ఎలా పెంచారు? ఆస్తి కోసం తండ్రి చావాలని కోరుకుంటావా? అంటాడు. చాలు ఆపండి.. దిక్కున్న చోట చెప్పుకోవాల్సిన కర్మ నాకు లేదు. ఇదే ఇంట్లో మీ అందరినీ ఎదిరించే దమ్ము నాకు ఉంది. నేను సొంత కూతుర్ని కాదు అని పదేపదే అన్నిసార్లు ఎందుకు అంటున్నారు నాకు తెలీదా? ధాన్యలక్ష్మితోపాటు ఇప్పుడు నేను అడుగుతున్నా ఆస్తి పంచాల్సిందే ఎవరి వాటా వారికి ఇవ్వాల్సిందే. అందులో నాకు నా కొడిక్కి, నా కొడుక్కు పుట్టబోయే బిడ్డకు ఆస్తి రావాల్సిందే అని తేగేసి చెబుతుంది రుద్రాణీ.

ఏమాత్రం మానవత్వం లేనివారిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు అంటాడు జగదీష్‌. నువ్వు ఆపు రుద్రాణీ అందరు కలిసి రాజ్‌కు పట్టంగట్టి నా నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారు. నేను సహించను ఎంత దూరమైన వెళ్తా, మీడియాలో పెట్టి అందరితో సంజాయిషీ చెప్పిస్తా అవసరమైతే కోర్టుకు ఇడుస్తా అంటుంది ధాన్యం. శభాష్‌ ధాన్యలక్ష్మి ఆస్తిని తన్నుకు పోయేలా చేయాలనుకునేవారికి నేను జవాబు ఇస్తా. నేను నీకు మద్ధతు ఇస్తా.

ఇదీ చదవండి:  మోహన్‌బాబుపై కేసు నమోదు.. తలకు గాయంతో ఆసుపత్రిలో నటుడు..!

పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్న దీనికి నేను ధాన్యాన్ని నిన్ను జైలుకు పింపిస్తాడు అంటాడు ప్రకాశం.  అది చూసుకుంటా అంటుంది రుద్రాణీ. ఏదైనా చేస్తా అంటుంది. దీంతో ప్రకాశం, ధాన్యలక్ష్మిలు వాగ్వాదానికి దిగుతారు. చాలు ఆపండి.. మానాన్న ఆసుపత్రిలో ఉంటే మా అమ్మను ఓదార్చకుండా ఆస్తి కోసం పోట్లాడుతారా? మీలాంటి వారితో కలిసి ఉండే కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకుంటా అంటాడు రాజ్‌ నాన్న. రేపే లాయర్‌ ను పిలిచి మొత్తం ఆస్తిని పంచేస్తా అంటాడు. 

రాజ్‌ ఏంటి డాడి.. తాతయ్యకు అలా ఉంటే ఆస్తి.. ఆస్తి అని పొద్దున లేస్తే ఇదే తంట.. కలిసి ఉండాలని ఏ ఒక్కరికీ లేదు. మనం మాత్రం ఏం చేస్తాం. రేయ్‌.. ప్రకాశం అంత వరకు నీ పెళ్లం నోరెత్తకుండా చూసే బాధ్యత నీదే అంటాడు. వెంటనే ప్రకాశం పెళ్లాన్ని ఛీకొట్టిపోతాడు. ఇక హాల్లో ఉన్న ధాన్యం, రుద్రాణీ, రాహుల్‌లు సంతోషపడతారు.

పెరట్లో కావ్య కోపంతో చేసే పనులు మంచి నిర్ణయాలు కావు మామయ్య అంటుంది. తాతయ్య ఈ వయస్సులో కూడా ఇల్లు విడిపోకుండా చూశాడు. అలసిపోయి ప్రస్తుతం విగతజీవిలా పడుకున్నాడు అంటుంది కావ్య. ఇదంతా ఎందుకు? ఆయన పిల్లలు, మనవలు ఒకే ఇంట్లో ఉండాలని అంతేకదా? తాతయ్య రెండురోజులు ఇంట్లో లేకపోతే ఇంటిని ముక్కలు చేయాలా? అంటుంది.మీరు తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని చెప్పాల్సి వస్తుంది మన్నించండి మామయ్య. వారి నోరు మీరు మూయించగలరు. ఈ విషయం నేను అక్కడే చెప్పాలనుకున్నా కానీ, మిమ్మల్ని తక్కువ చేయాలనుకోలేదు. ఒక్కసారి ఆలోచించండి అంటుంది. కానీ, ఇల్లంతా ఆస్తి అని రుద్రాణీ నేటితరం శకునిలా మారింది అందరినీ రెచ్చగొడుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అంటాడు.

ఇదీ చదవండి: రాజ్‌పైకి ధాన్యలక్ష్మి ఉసిగొల్పిన రుద్రాణికి దిమ్మదిరిగే షాక్‌.. ఆస్తి మొత్తం కావ్యకు రాసేసిన తాతయ్య..! 

ఇక రాత్రి బెడ్‌ రూంలో కావ్యరాజ్‌ల సీన్‌ ఉంటుంది. కనీసం ఈ ఇంట్లో ఏం జరుగుతుంతో నీకు అర్థమవుతుందా? నన్ను ఎలాగో పట్టించుకోరు అంటుంద కావ్య. అంత పెద్ద విషయం నేను పట్టించుకోదలుచుకోలేను అంటాడు రాజ్‌. ఇల్లు విడిపోవడం నీకు ఇష్టమేమో కానీ తాతయ్యకు ఇష్టం లేదు. ఆస్తి పంపకం గురించి తెలిస్తే ఆ ప్రాణం అక్కడినుంచే అటే పోతుంది. ఏవండి అర్థం చేసుకోండి. మావయ్యకు చెప్పాను కానీ, ఆయన చేతులు ఎత్తేశాడు అంటుంది కావ్య. అలా అవ్వకూడదని ఇన్ని రోజులు నేను ప్రయత్నించాను అరెయ్‌ ఎవరికి వారు ఆస్తులు కావాలని గొడవ పెడుతున్నారు. ఒక్కమాటైనా నన్ను తాతయ్య అడగలేదు నిన్ను సీఈఓ చేసినప్పుడు, ఇప్పుడు కూడా నన్ను ఎవరూ అడగలేదు అంటాడు రాజ్‌. ఇక కావ్యకు ఆస్తి మొత్తం రాసిచ్చాడు పెద్దాయనా అని నేడు కూడా రేపటి ఎపిసోడ్‌లో చూసిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News