Pushpa 2 The Rule: సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో బిగ్‌ ట్విస్ట్‌.. నల్లగొండలో అగ్నిప్రమాదం

Big Twist In Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 ది రూల్‌ సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్‌లలో ప్రమాదాలు సంభవించాయి. తొక్కిసలాట కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 5, 2024, 10:47 AM IST
Pushpa 2 The Rule: సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో బిగ్‌ ట్విస్ట్‌.. నల్లగొండలో అగ్నిప్రమాదం

Pushpa 2 The Rule Stampede: ప్రీమియర్‌ షో.. సాధారణ షోలతో సంచలనం సృష్టించిన పుష్ప 2 ది రూల్‌ సినిమా తీవ్ర వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని మహిళా మృతి చెందగా.. జిల్లాల్లో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తాజాగా నల్గొండ జిల్లాలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఫలితంగా థియేటర్‌ దగ్ధమవడం సంచలనంగా మారింది. ఇక తొక్కిసలాటకు కారణమైన సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Pushpa 2 The Rule: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. సంధ్య థియేటర్‌ వద్ద ఉద్రిక్తత

నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్‌ షోలో పుష్ప 2 ది రూల్‌ ప్రదర్శించారు. మార్నింగ్ షో ప్రారంభమైన సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. థియేటర్ లోపల అల్లు అర్జున్‌ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరిపడ్డారు. నిప్పురవ్వలు థియేటర్‌ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి. విసిరేసిన పేపర్లకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది, అభిమానులు వెంటనే మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ అగ్ని ప్రమాదంతో సినిమా షో రద్దయ్యినట్లు తెలుస్తోంది.

Also Read: Pushpa 2 The Rule: ఇంటర్నెట్‌లో పుష్ప 2 సినిమా లీక్‌..? 'వైల్డ్‌ ఫైర్‌'గా అల్లు అర్జున్‌ ఎంట్రీ

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోతో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున 5:30 గంటలకే సినిమా బెనిఫిట్స్ వేయడంతో అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేశారు. మూడు జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, నకిరేకల్, దేవరకొండ, హాలియా పట్టణాలలో థియేటర్ల వద్ద అభిమానులు అల్లు అర్జున్ కటౌట్‌కి అభిమానులు పాలాభిషేకం చేశారు.

కేసు నమోదు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట సంచలనంగా మారింది. మహిళా మృతి.. ఇద్దరు బాలురు గాయపడడం వివాదస్పదంగా మారింది. అయితే ఈ వివాదంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తొక్కిసలాటకు కారణమైన థియేటర్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News