టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. వరుసగా హీరోలు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్ లాంటి మెగా ఫ్యామిలీ సెలబ్రిటీలు కరోనా బారిన పడి అనంతరం కోలుకున్నారు. తాజాగా కరోనా బాధితుల జాబితాలో మరో మెగా ఫ్యామిలీ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు కరోనా సోకింది. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా బన్నీనే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు రావడంతో టెస్టులు చేయించుకోగా, కోవిడ్19 పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అందరికీ నమస్కారం. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. సొంతంగా మా ఇంట్లోనే నేను ఐసోలేషన్‌కు వెళ్లిపోయాను. ఇటీవల నన్ను కలుసుకున్న వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవద్దు. ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండాలంటూ’ తన ట్వీట్‌లో అల్లు అర్జున్(Allu Arjun) సూచించాడు.
Also Read: Telangana COVID-19 Updates: ఒక్కరోజులో 56 కరోనా మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు
Hello everyone!
I have tested positive for Covid. I have isolated myself.
I request those who have come in contact with me to get tested.
I request all my well wishers and fans not to worry as I am doing fine . Stay home, stay safe . pic.twitter.com/CAiKD6LzzP— Allu Arjun (@alluarjun) April 28, 2021
కాగా, సినిమాల విషయానికొస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప(Pushpa movie). గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తీస్తున్న మూవీ కావడంతో బన్నీ తాజా సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న తొలిసారిగా జత కట్టింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ పుష్ప మూవీని నిర్మిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook