Petrol Diesel Price Today 21 April 2024: ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు దేశంలోని పెట్రోల్ డీజిల్ రేట్లను విడుదల చేస్తాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఓఎంసీలు పెట్రోల్ డీజిల్ రేట్లలో మార్పులు చేర్పులు చేస్తాయి. ఈరోజు వారీ పెట్రోల్ డీజిల్ మార్పులను వినియోగదారులకు ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంది. మనదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఫ్రైట్ చార్జెస్, VAT, లోకల్ టాక్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఏప్రిల్ 21 నాడు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోలో పెట్రోల్ డీజిల్ ధరలు..
ఆదివారం ఏప్రిల్ 21 రోజు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 95.65 వద్ద ఉంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటరుకు 94.72 నమోదు చేసింది. ఇక డీజిల్ ధరల విషయానికి వస్తే లీటర్కు 87.62 వద్ద ఉంది.వాణిజ్య నగరం ముంబైలో పెట్రోల్ ధరలు మాత్రం 100 ను దాటేసాయి లీటరు పెట్రోల్ ధర 104.21. ఇక ముంబైలో డీజిల్ ధరల విషయానికి వస్తే డీజిల్ లీటరుకు 92.1 5 వద్ద ఉంది.
ఇదీ చదవండి: గోల్డ్ రేట్స్.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే దీంతో పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. ఇండియన్ రూపీ తో అమెరికన్ డాలర్ మారకం కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభావం పడుతుంది. ట్యాక్స్ విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై టాక్స్ ను విధిస్తాయి. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు డిమాండ్ ప్రభావం కూడా చూపుతుంది ఇంధనం డిమాండ్ పెరిగితే వాటి ధరలు కూడా పెరిగిపోతాయి.
ఇదీ చదవండి: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఇంట్లోంచి ఎలా ఫైల్ చేయాలి, ఏమేం అవసరం
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
నగరం | పెట్రోల్ ధర (Litre) | డీజిల్ ధర (Litre) |
హైదరాబాద్ | రూ. 107.41 | రూ.95.65 |
చెన్నై | రూ. 100.98 | రూ. 92.56 |
బెంగళూరు | రూ. 99.84 | రూ. 85.93 |
లక్నో | రూ. 94.65 | రూ. 87.76 |
జైపూర్ | రూ. 104.88 | రూ. 90.36 |
కోల్ కత్త | రూ. 103.94 | రూ. 90.76 |
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook