Mobile Charging Tips: స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. మొబైల్స్ కు ప్రతిరోజూ బ్యాటరీ ఖర్చు అయిన తర్వాత ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కొంత మంది మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల మొబైల్ బ్యాటరీ వెంటనే పాడయ్యే అవకాశం ఉంది. అయితే స్మార్ట్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టే క్రమంలో తరచూ చేసే తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంపెనీ ఛార్జర్ ను వినియోగించండి!
మీరు ఫోన్ బ్యాటరీ పాడైపోకుండా.. ఎక్కువ కాలం పాటు ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్లప్పుడూ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయాలి. వాటి స్థానంలో వేరొక ఛార్జర్లను ఉపయోగించడం వల్ల బ్యాటరీపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ దెబ్బతింటుంది. ఈ క్రమంలో మీ మొబైల్ కంపెనీ ఇచ్చిన ఛార్జర్ ను వినియోగించడం మేలు.
వెంటవెంటనే ఛార్జ్ చేయవద్దు!
మనలో చాలా మంది తమ మొబైల్స్ ను తరచూ ఛార్జ్ చేస్తుంటారు. బ్యాటరీ 90 శాతం ఛార్జ్ అయినప్పటికీ, మొబైల్ ఇప్పటికీ ఛార్జ్ పెడుతుంటారు. తరచూ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పడుతుందని స్మార్ట్ ఫోన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాటరీ 20 శాతం ఉన్నప్పుడు ఛార్జ్ చేయాలి!
మీ మొబైల్ బ్యాటరీ 20 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడే మొబైల్ ను ఛార్జ్ లో పెట్టాలి. అలా చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి ఉండదు. దీంతో బ్యాటరీ వెంటనే చెడిపోదు.
మొబైల్ కవర్ లేకుండా ఫోన్ ఛార్జ్ చేయాలి!
మొబైల్ కవర్స్ ఉండగానే చాలా మంది ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ ను అలా ఛార్జ్ చేయకూడదు. మొబైల్ కవర్‌తో ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫోన్‌ను ఛార్జ్ చేసే ముందు కవర్ ను తీసేయడం మేలు.
ఛార్జింగ్ యాప్స్ ను నివారించండి!
ఫాస్ట్ ఛార్జింగ్ కోసం చాలా మంది స్మార్ట్ ఫోన్స్ లో యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. కానీ, అలాంటి యాప్స్ వల్లనే ఎక్కువగా బ్యాటరీ పవర్ ఖర్చు అవుతుంది. ఈ యాప్స్ వల్ల మీ బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అలాంటి థార్డ్ పార్టీ యాప్స్ ను వినియోగించకపోవడం మంచిది.
Also Read: Vodafone Idea Plan: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఫీచర్ ఇకపై అందుబాటులో ఉండదు!
Also Read: WhatsApp New Update: వాట్సాప్ కొత్త అప్డేట్.. ఒకేసారి రెండు మొబైల్స్ లో లాగిన్ అవ్వొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook