Loan Tips: ఇప్పుడు రుణాలు కావాలంటే అన్నింటికంటే ముఖ్యంగా కావల్సింది ఆ వ్యక్తి సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్. అంటే ఆ వ్యక్తి ఆదాయం, గతంలో లోన్ల వివరాలు, సకాలంలో చెల్లించాడా లేదా అనేదానిపై ఆధారపడి నిర్ణయించేది.
క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణం సులభంగా లభించడమే కాకుండా వడ్డీ రేటు కూడా మారుతుంటుంది. క్రెడిట్ స్కోరు 600-649 మధ్యలో ఉంటే రుణం పొందే అవకాశాలు చాలా తక్కువ. అదే 650-699 మధ్యలో ఉంటే క్రెడిట్ అర్హతకు ఫరవాలేదని చెప్పవచ్చు. అదే విధంగా క్రెడిట్ స్కోరు 700-749 మద్య ఉన్నా లేక ఇంతకంటే ఎక్కువ ఉన్నా రుణాలు చాలా సులభంగా పొందవచ్చు. అయితే క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు స్థిరమైన ఆదాయ వనరులుంటే రుణాలు లభిస్తాయి. అంటే శాలరీ స్లిప్, జాబ్ లెటర్, ఐటీ రిటర్న్స్ వంటి పత్రాలు చాలా అవసరం. ఎక్కువకాలం ఒకే కంపెనీలో ఉద్యోగం చేసేవారికి కూడా స్థిరత్వం ఆధారంగా రుణం లభించవచ్చు. ఆదాయం వర్సెస్ రుణాల నిష్పత్తి ఆధారంగా కూడా రుణాలు లభిస్తాయి. మీ మొత్తం రుణాలు ఆదాయం కంటే తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి.
కో అప్లికెంట్ అంటే మీ కుటుంబసభ్యులు లేదా జీవిత భాగస్వామితో కలిసి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే త్వరగా రుణం లభించవచ్చు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ స్కోరు కాస్త కక్కువగా ఉన్నా ఫరవాలేదు. సాధారణంగా రుణానికి అవసరమయ్యే వాటితో పాటు అదనపు డాక్యుమెంట్లు ఇవ్వడం ద్వారా రుణాలు పొందే అవకాశాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook