Flipkart Personal Loans: ఇప్పటి వరకూ ఆన్లైన్ రిటైలర్ ప్లాట్‌ఫామ్‌గా పేరుగాంచిన ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త సేవలు అందనున్నాయి. వ్యక్తిగత రుణాల కోసం ఎదురుచూసేవారికి సుదీర్ఘమైన బ్యాంకింగ్ ప్రక్రియ లేకుండానే రుణాలు పొందే అవకాశం కలుగుతోంది. అవే ఫ్లిప్‌కార్ట్ పర్సనల్ లోన్స్.
ఇటీవలి కాలంలో వ్యక్తిగత రుణాల సౌకర్యం బాగా పెరిగింది. వివిధ బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు, లోన్ యాప్స్ ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత రుణాలపై ఫోకస్ చేస్తున్నాయి. బ్యాంకుల్నించి వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే అదో పెద్ద ప్రహసనం. బ్యాంకులు పెట్టే షరతులు, ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి చాలా ఆలస్యమైపోతుంటుంది. ఈ క్రమంలో ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ ఇచ్చే వాటికి ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ సైతం తన కస్టమర్లకు మూడేళ్ల వరకూ వ్యక్తిగత రుణాలు అందివ్వనున్నట్టు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో 5 లక్షల వరకూ పర్సనల్ రుణాలను కేవలం 30 సెకన్లలోగా ఆమోదించనుంది. ఫ్లిప్‌కార్ట్‌కు దాదాపు 45 కోట్ల వరకూ రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ 45 కోట్లలో వ్యక్గిగత రుణాల కోసం అప్లై చేసుకుంటే కేవలం 30 సెకన్లలో ఆమోదం లభిస్తుంది.
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బై నౌ పే లేటర్, ఈఎంఐ, క్రెడిట్ కార్డు వంటి సేవల్నిఅందిస్తోంది. ఇక నుంచి వ్యక్తిగత రుణాలు కూడా అందించే సౌకర్యం ప్రారంభిస్తోంది. 5 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 6 నెలల్నించి 36 నెలల్లోగా చెల్లించవచ్చు. లోన్ దరఖాస్తు కోసం కస్టమర్లు పాన్ నెంబర్, పుట్టిన తేదీ, ఉద్యోగం వివరాలు అందించాల్సి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ , ఆదాయాన్ని బట్టి రుణం మంజూరు ఉంటుంది.
Also read: Hyundai SUV Sales: హ్యుండయ్ కంపెనీ క్రెటానే కాదు వెన్యూ కూడా టాప్ సెల్లర్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook