Cheapest Data Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్‌.. అతి తక్కువ ధరలో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా!

BSNL Rs 1999 Annual Prepaid Plan: BSNL Offers 600 GB of Data and unlimited calls for One Year with Rs 1999  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 27, 2022, 11:11 AM IST
  • బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్
  • అతి తక్కువ ధరలో ఏడాది పాటు అపరిమిత కాలింగ్
  • 365 రోజుల పాటు డేటా
Cheapest Data Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్‌.. అతి తక్కువ ధరలో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా!

BSNL Offers 600 GB of Data and unlimited calls for One Year: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్లాన్లను అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విభాగంలో ఇతర టెలికాం సంస్థలకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తోంది. కేవలం రూ. 1999కే వినియోగదారులకు దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అనేక ఇతర ప్రయోజనాలతో పాటు వన్-టైమ్ డేటాను పొందుతారు. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం సంస్థ ఏడాది పాటు డేటా వ్యాలిడిటీ ఇవ్వడం లేదు. 

బీఎస్ఎన్ఎల్ తన రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని మొత్తం 365 రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ దేశంలోని అనేక సర్కిల్‌లలోని వినియోదాదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 మెసేజ్‌లు మరియు 600 జీబీ వన్-టైమ్ డేటాను పొందుతారు. ఈ డేటాను వినియోగదారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. 

ఈ రోజుల్లో చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లు రోజువారీ డేటా పరిమితిని 1.5 GB, 2 GB లేదా 3 GBతో అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అలా ఉండదు. ఈ ప్లాన్‌లో అందించే 600 GB డేటాను ఎప్పుడు కావాలంటే అప్పడు ఉపయోగించుకోవచ్చు. డేటా  పరిమితి వినియోగదారుపై ఆధారపడి ఉంటుంది. 600 GB డేటాను ఒక రోజులో ఉపయోగించవచ్చు లేదా మొత్తం సంవత్సరానికి తదనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. 

600 GB డేటా వినియోగం తర్వాత మీ ఇంటర్నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అప్పుడు డేటా కావాలంటే ఇతర ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల పాటు PRBT, Eros Now ఎంటర్‌టైన్‌మెంట్ మరియు Lokdhun కంటెంట్‌క యాక్సెస్ పొందుతారు. మీ మొబైల్‌లో బీఎస్ఎన్ఎల్ ప్రాథమిక సిమ్ అయితే ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. 

Also Read: AP Schools Reopening: 2022-23 అకడమిక్‌ కేలండర్‌ విడుదల.. జులై 5 నుంచి పాఠశాలలు ఆరంభం!  

Also Read: Rahu-Mangal Yuti 2022: మేషరాశిలో అంగారక యోగం.. ఈ 4 రాశులవారు జాగ్రత్త..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News