Bank Privatisation: కేవలం 6 రోజుల్లో ప్రైవేట్‌పరం కానున్న మరో ప్రభుత్వ బ్యాంకు

Bank Privatisation: దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్‌పరం అవుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. జనవరి నెలలో మరో బ్యాంకు ప్రైవేట్‌పరం కానుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2023, 06:31 PM IST
Bank Privatisation: కేవలం 6 రోజుల్లో ప్రైవేట్‌పరం కానున్న మరో ప్రభుత్వ బ్యాంకు

ఎన్డీయే ప్రభుత్వం ప్రైవేటీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ రంగంలోని పలు పరిశ్రమలు, బ్యాంకుల్ని ప్రైవేట్‌పరం చేస్తోంది. ఇప్పటికే దేశంలో పలు బ్యాంకులు ప్రైవేట్‌పరం కాగా, మరో వారం రోజుల్లో ఇంకో బ్యాంకు ప్రైవేట్‌పరం కానుంది.

బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. జనవరి నెలలో మరో ప్రభుత్వ బ్యాంకు ప్రైవేటు చేతికి చిక్కనుంది. ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో అంటే కేవలం వారం రోజుల్లో ప్రైవేట్‌పరం కానున్న ఆ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు. 

జనవరి 7వరకూ ప్రైవేట్ కానున్న ఐడీబీఐ బ్యాంకు

ప్రభుత్వం ఇటీవల కొద్దికాలంగా బ్యాంకుల్లో వాటాల్ని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ అంశంపై కీలకమైన అప్‌డేట్ వచ్చింది. జనవరి 7 వరకూ అంటే కేవలం 6 రోజుల్లో ఐడీబీఐ బ్యాంకు ప్రైవేట్‌పరం కానుంది. 

ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకై ఓపెన్ టెండర్లు దాఖలు చేసేందుకు గడువు తేదీని జనవరి 7 వరకూ పెంచింది. ప్రభుత్వం, ఎల్ఐసీలు ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను విక్రయించనున్నాయి. దీనికోసం ఐడీబీఐ బ్యాంకు ఆసక్తి కలిగిన సంస్థల్నించి అక్టోబర్ నెలలోనే టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు దాఖలు చేసేందుకు డిసెంబర్ 16 చివరి తేదీగా ఉండేది. ఇప్పుడీ గడువును జనవరి 7 వరకూ పెంచింది ప్రభుత్వం.

గడువు తేదీ పెంచాలనే విషయంపై ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు అందాయి. ఈ విజ్ఞప్తుల ఆధారంగా ప్రభుత్వం గడవు తేదీని పెంచింది. ఈవోఐ దాఖలు చేసేందుకు చివరి తేదీ జనవరి 14 వరకూ పెంచారు. 

ఐడీబీఐ బ్యాంకును కొనుగోలు చేసేందుకు కార్లైన్ గ్రూప్, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, డీసీబీ బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలో ఐడీబీఐ బ్యాంకు షేర్లు గణనీయంగా పెరిగాయి. అయితే ఈ సంస్థలు ఐడీబీఐలో దాదాపు 10 శాతం వాటా కోసం టెండర్ దాఖలు చేయవచ్చు. 

Also read: LIC Plans: ప్రీమియం ఒక్కసారి చెల్లించి..నెలనెలా 20 వేలు పెన్షన్ తీసుకునే ఎల్ఐసీ పాలసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News