రూ.1600 కోట్లకు అధినేతనని.. హైదరాబాద్‌లో స్థానికులను బురిడీ కొట్టించింది

విజువల్ గ్రాఫిక్స్ నిపుణురాలిగా పేరు పొందిన ఒకామె హైదరాబాద్‌లో కొన్ని సంవత్సరాలుగా నివాసముంటోంది. పలు తెలుగు చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా ఆమె పనిచేసింది. 

Last Updated : Oct 12, 2018, 08:45 PM IST
రూ.1600 కోట్లకు అధినేతనని.. హైదరాబాద్‌లో స్థానికులను బురిడీ కొట్టించింది

విజువల్ గ్రాఫిక్స్ నిపుణురాలిగా పేరు పొందిన ఒకామె హైదరాబాద్‌లో కొన్ని సంవత్సరాలుగా నివాసముంటోంది. పలు తెలుగు చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా ఆమె పనిచేసింది. తాను అమెరికాలో గొప్ప ఆస్తిపరురాలినని.. తనకు దాదాపు రూ.1600 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయని స్థానికులను నమ్మించింది. బంజారాహిల్స్‌లోని ఓ విద్యాసంస్థలో విద్యార్థులకు కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ నేర్పించే టీచర్‌గా కూడా పనిచేసిన ఆమె.. ఓ ఆర్థిక నేరస్తురాలన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ ధనికుడిని నమ్మించి అమెరికాలో తన ఆస్తులను వెనక్కి తెచ్చుకొనేందుకు సహాయం చేయమని.. తన అకౌంటులో రూ.1.20 కోట్లు డిపాజిట్ చేస్తే.. ఆ డబ్బును వడ్డీతో సహా చెల్లించేస్తానని తెలిపింది.

ఆ కథ నిజమేనని నమ్మిన ఆయన ఆమెకు సహాయం చేయగా.. ఆమె అదే డబ్బుతో బంగారం కొనడంతో పాటు పలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో కూడా పెట్టుబడి పెట్టింది. తర్వాత తనకు డబ్బు ఇచ్చిన వ్యక్తికి ఎలాంటి సమాధానమూ చెప్పకుండా తప్పించుకోవడం ప్రారంభించింది. తను మోసపోయానన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఖమ్మం వాసి రాచకొండ పోలీసులను ఆశ్రయించడంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

గతంలో సదరు గ్రాఫిక్స్ నిపుణురాలు అమెరికాలో ఉన్న మాట వాస్తవమేనని.. అయితే ఆమె చెప్పిన విషయాలు వాస్తవాలు కాదని.. ఇప్పటికే ఆమెపై పలు చీటింగ్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.  ఎస్‌వోటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై సత్యనారాయణ ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సదరు నేరస్తురాలి నుండి పలు పత్రాలను, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ల విషయంలో ప్రజలు జాగరూపులుగా వ్యవహరించాలని తెలిపారు.

Trending News