Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..

Vande Metro Look Revealed: ఇప్పటివరకు కేవలం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ చూసాము. ఇప్పుడు కొత్త వందే భారత్ మెట్రోని తాజాగా రైల్వే శాఖ విడుదల చేసింది. ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.  దాని ఫీచర్స్ వెళ్లే మార్గాలు ఏంటో చూద్దాం.
 

1 /6

సామాన్యులకు వందే భారత్ మెట్రోలను పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వందే మెట్రోని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంది.  

2 /6

ఈనేపథ్యంలో మరికొన్ని నెలల్లోనే వందే మెట్రోని ప్రారంభించనున్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల ,ఐసిఎఫ్ చెన్నైలో సిద్ధమవుతున్నాయి.   

3 /6

వందే మెట్రోను తొలిసారిగా 2023 ఫిబ్రవరిలో ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి ఈ రైళ్లను ప్రారంభిస్తున్నారు.  

4 /6

పాత ఈఎంయూ స్థానంలో ఈ వందే మెట్రోలను ప్రారంభిస్తున్నారు. ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వంద మంది కూర్చొని, 200 మంది నిలబడి ప్రయాణించవచ్చు. వందే మెట్రో ట్రైన్ ఎల్సిడి డిస్ప్లేతోపాటు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉన్నాయి.

5 /6

ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ రైలు యాక్సిడెంట్ కాకుండా కవచ్ అనే సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి.  

6 /6

తిరుపతి-చెన్నై, ఢిల్లీ-రేవారి, లక్నో-కాన్పూర్, భువనేశ్వర్-బాలాసోర్ వంటి మార్గాలలో వందే మెట్రో నడపవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.