/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Chandrababu Naidu Latest News: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే జైళ్లో ఆయన భద్రతపై, ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని.. 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్‌ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ నడుస్తుందని తెలిపారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్‌ ఉన్నాయన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ జరుగుతుందని చెపారు. ప్రతీ గంటకో మారు గార్డ్‌ సెర్చ్‌ చేస్తున్నామన్నారు.

"ఎస్పీ గారితో మాట్లాడి ప్రత్యేకంగా సెంట్రల్‌ పోలీస్‌ లైన్‌ టీమ్‌తో జైలు చుట్టుపక్కలా వాచింగ్‌ నడుస్తుంది. ఈనెల 22వ తేదీన జైలు వాటర్‌ ట్యాంక్‌ వైపు ఒక డ్రోన్‌ తిరిగిందని నార్త్‌ఈస్ట్‌ వాచ్‌టవర్‌ గార్డు నుంచి మాకు సమాచారం వచ్చింది. అయితే క్లోజ్డ్‌ జైల్‌ వైపు ఆ డ్రోన్‌ రాలేదు. దీనిపై మేం జైళ్లశాఖ నుంచి అధికారికంగానే సమీప పోలీసుస్టేషన్‌కు కమ్యూనికేషన్‌ అందించాం. ఆ తర్వాత మా జైల్‌పై ఎలాంటి డ్రోన్స్‌ రాకపోకలు జరగలేదు. మావోల పేరుతో వచ్చిన లేఖ ఒరిజినల్‌ కాదు. అది నకిలీ లేఖగా గుర్తించాం. చంద్రబాబుకు సంబంధించిన బెదిరింపు లేఖ ఫేక్‌ అని విచారణలో తేలింది.

జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు అధికారుల అటెస్టేషన్‌ చేయలేదు. జైల్లోకి వచ్చే ప్రతీ ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకనే లోపలికి అనుమతిస్తాం. శ్రీనివాస్‌ అనే ఖైదీని రిమాండ్‌కు తెచ్చినప్పుడు ఆయన వద్ద ఒక బటన్‌ కెమెరా ఉన్నట్లు గుర్తించాం. అయితే వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా.. అందులో ఎలాంటి జైల్‌ ఫుటేజీ లేదు. అతని ఫ్యామిలీ ఫోటోస్‌ రెండు ఉన్నాయి. మేం స్వాధీనం చేసుకున్న కెమెరాను కూడా పోలీసు వారికి అప్పగించాం. దాన్ని రిమాండ్‌ ఖైదీ ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతుంది.

చంద్రబాబు వచ్చిన దగ్గర్నుంచీ ఈరోజు వరకు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరిన దాఖల్లాల్లేవు. అది ఎప్పటికీ జరిగే అవకాశమేలేదు. చంద్రబాబు కుడి కంటి కేటరాక్ట్‌ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించాము. వారు పరీక్షలు చేశారు. చంద్రబాబుకు ఇమ్మెచ్చ్యూర్‌ కేటరాక్ట్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కొంత సమయం తర్వాతైనా ఆపరేషన్‌ చేయించుకోవచ్చని వైద్యులు సూచించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేము ఎలాంటి తప్పుడు రిపోర్టు బయటకు ఇవ్వలేదు.." ఆయన తెలిపారు.

ఆయన ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నామని జైళ్లశాఖ డీఐజీ తెలిపారు. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహా బ్యారెక్‌లో చంద్రబాబును ఏ రూమ్‌లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించలేమని చెప్పారు. జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇప్పటికే విచారణ కొనసాగుతుందన్నారు. చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి ప్రభుత్వ వైద్యులకు చెప్పారని.. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు కూడా రాశామన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో సజేషన్‌ ఇవ్వాలని భువనేశ్వరికి కూడా తెలియజేశామని.. ఇదే విషయాన్ని కోర్టుకూ తెలియపరిచామన్నారు.

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు  

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
Prisons Deparment DIG Ravi Kiran given clarity on Chandrababu Naidu safety and health in Rajahmundry Jail
News Source: 
Home Title: 

Chandrababu Naidu: జైల్లో చంద్రబాబు భద్రతపై జైళ్లశాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు.. ఆ అవకాశమే లేదు
 

Chandrababu Naidu: జైల్లో చంద్రబాబు భద్రతపై జైళ్లశాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు.. ఆ అవకాశమే లేదు
Caption: 
Chandrababu Naidu (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జైల్లో చంద్రబాబు భద్రతపై జైళ్లశాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు.. ఆ అవకాశమే లేదు
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Friday, October 27, 2023 - 22:26
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
28
Is Breaking News: 
No
Word Count: 
380