Political strategist prashant kishor hot comments on ysrcp: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడుతల్లో ఎన్నికలు జరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలలో నాలుగో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉండగా.. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో ప్రజలంతా ఓటింగ్ లో భారీఎత్తున పాల్గొన్నారు. ఇక ఏపీలో మునుపటి కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఆయాపార్టీల నేతలంతా జూన్ 4 వరకు ఎన్నికల ఫలితాల కోసం వేచీ చూస్తున్నారు.
Read more: Nirmala sitharaman: మెట్రోలో నిర్మలా సీతారామన్ కు చేదు అనుభవం.. వైరల్ వీడియో..
ఈ నేపథ్యంలో ప్రస్తుతం.. ఎన్నికలలో ఆయాపార్టీల నేతలంతా ఎవరికి వారు.. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటే కాదు... తమ మాపార్టీ అధికారంలోకి వస్తుందంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో ఈసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ లు కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ తరపున షర్మీల కూడా బరిలో నిలబడ్డారు. వైఎస్ జగన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక వైఎస్సార్సీపీ నేత సీఎం జగన్.. తను ప్రజల కోసం అమలు చేసిన పథకాలు చూసి తనకు ఓటు వేయాలని కూడా అభ్యర్థించారు. ఇక ఓటరు దేవుళ్లు తమ తీర్పును చెప్పేశారు. ఏదీఏమైన జూన్ 4 వరకు ఫలితాల కోసం వేచీ చూడాల్సిందే.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికలలో వైఎస్సార్పీపీ అధికారంలోకి రాదని తెల్చీ చెప్పారు. అంతేకాకుండా.. తాను గత పదేళ్లుగా రాజకీయాలను గమనిస్తున్నానని, ఎన్నికలలో పోటీకి దిగిన ఏ అభ్యర్థి కూడా ఓడిపోతానంటూ ఫలితాలకు ముందు ఒప్పుకొడని అన్నారు. నాలుగు రౌండ్లలో వెనుకంజలో ఉన్నప్పటికి, వచ్చే రౌండ్ లలో తామే గెలుస్తామంటూ లేని కాన్ఫిడెన్స్ చూపిస్తారంటూ సెటైర్ లు వేశారు.
Read more: Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..
తామే గెలుస్తామని జగన్, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ లు, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు. కానీ రిజల్ట్ మరోవిధంగా ఉంటుందని అన్నారు. సీఎం జగన్ గతంలో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తామంటున్నారు.. ఇది జరిగే పని కాదన్నారు. ఇక ఫలితాలువచ్చే వరకు తామే గెలుస్తామని నేతలు మాట్లాడే మాటలకు అంతే ఉండదంటూ కూడా పంచ్ లు వేశారు. ఇదే క్రమంలో.. బీజేపీ ,మోదీ కేంద్ర నాయకత్వం పై ప్రజలు కాస్తంతా అసంతృప్తితో ఉన్నారని, ఆగ్రహాంతో లేరని అన్నారు. బీజేపీకి 2019 మాదిరిగా అదేసంఖ్యలో సీట్లు లేదా అంతకంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందని ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter