Golla Baburao: అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొట్టి తీరుతా.. సీఎం జగన్‌కే వార్నింగ్ ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...

Golla Baburao warns CM Jagan: వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఏకంగా సీఎం జగన్‌కే వార్నింగ్ ఇస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వని అధిష్ఠానాన్ని తాను దెబ్బ కొట్టి తీరుతానని బహిరంగ హెచ్చరిక చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 01:02 PM IST
  • వైసీపీ అధిష్ఠానంపై ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సంచలన వ్యాఖ్యలు
  • దెబ్బకొట్టి తీరుతానంటూ అధిష్ఠానానికే వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే
  • తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బాబూరావు ఆగ్రహం
Golla Baburao: అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొట్టి తీరుతా.. సీఎం జగన్‌కే వార్నింగ్ ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...

Golla Baburao warns CM Jagan: ఏపీ కొత్త కేబినెట్‌లో తనకు బెర్త్ దక్కకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు పాయకరావు పాటు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. పార్టీ అధిష్ఠానంపై బహిరంగంగానే తన ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. తనను అమాయకుడిగా భావించి మంత్రి పదవి రాకుండా అధిష్ఠానం దెబ్బకొట్టిందని తాజాగా వ్యాఖ్యానించారు. అవకాశం వచ్చినప్పుడు తానూ దెబ్బ కొట్టి తీరుతానని హెచ్చరించారు. నియోజకవర్గంలోని కోటవురట్లలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో బాబూరావు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక మాట కోసం తాను వైసీపీలో చేరానని... హింసావాదంతో ఆ పార్టీలోకి వెళ్లానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. ఎంతో మంది వద్దని చెప్పినా వినకుండా వైసీపీలో చేరి ఎన్నో త్యాగాలు చేశానని... అయినా తనకు మంత్రి పదవి దక్కలేదని అన్నారు. తనను అమాయకుడిగా భావించి అధిష్ఠానం మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తనపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మందికి ఏం సమాధానం చెప్పాలని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.

తనను అధిష్ఠానం అమాయకుడిగా భావిస్తుందేమో.. కానీ తాను మాత్రం హింసావాదినే అని బాబూరావు పేర్కొన్నారు. ఇదే మాట ఎక్కడికైనా వచ్చి చెప్పగలనని అన్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో స్థానిక కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... ఆ విషయం సీఎం జగన్‌కు తెలియాలని అన్నారు. నియోజకవర్గం నుంచి 70 కార్లలో 250 మందిని తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశానని... అయినా ఆయన నుంచి స్పందన రాలేదని అన్నారు. అధిష్ఠానం తనను దెబ్బకొట్టింది కాబట్టి తానూ దెబ్బకొట్టి చూపిస్తానని హెచ్చరించారు.

మాట మార్చిన ఎమ్మెల్యే...?

పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలను వక్రీకరించారని... తాను పార్టీ అధిష్ఠానానికి ఎప్పటికీ విధేయుడిననే చెప్పారు. మంత్రి పదవి రానందుకు తనకు బాధగా లేదని... అయితే నియోజకవర్గానికి ఇప్పటివరకు మంత్రి పదవి రాలేదని స్థానిక ప్రజల్లో ఆవేదన ఉందని అన్నారు. తమ నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయం గురించే చెప్పేందుకే అలా మాట్లాడానని... అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని అన్నారు. 
 

Also Read: Xiaomi 11i 5G Flipkart: రూ.30 వేల విలువైన Xiaomi 5G మొబైల్ ను రూ.10 వేలకే కొనండి!

Also Read: Viral Video: పెళ్లిలో వరుడి చెంప చెడామడా వాయించేసిన వధువు... వైరల్ అవుతోన్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News