Pawan Kalyan: వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పేదల నుంచి వైసీపీ నేతలు ఇళ్ల స్థలాలను లాక్కుకుంటున్నారన్నారు. పెద్దల నుంచి కింది స్థాయి నేతల వరకు ఇదే దందా కొనసాగుతోందని విమర్శించారు. అధికార మదంతో ఆ పార్టీ నేతలంతా కొట్టుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందుకే వైసీపీ నేతలంటే చిరాకు అని అన్నారు.
ఒక నాయకుడు కబ్జాలు చేసి..అవినీతికి పాల్పడితే భరించగలమని..కానీ కిందిస్థాయి నేతల వరకు ఇదే పరిస్థితి ఉంటే ఇలా అని ప్రశ్నించారు. రాష్టమంతటా మినీ వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. విశాఖలో విలువైన కొండలను కరిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కబ్జాల్లో భూములు కోల్పోయిన వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో రాష్ట్ర మంత్రులు జోక్యం చేసుకోవాలన్నారు.
రాబోయే రోజుల్లో వైసీపీ ప్రజాగ్రహానికి గురవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. విజయవాడలో రెండోవిడతలో భాగంగా జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తామని ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీనిచ్చారు.
Also read:Southwest Monsoon: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ..!
Also read:IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర..రెండో టీ20లో ఆసక్తికర ఘటన..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook