సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీలో భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాలరావు చేరారు. గురువారం విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ అభిమానులు సైతం భారీ సంఖ్యలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ పని చేస్తుందని తెలిపారు. 2019లో జనసేన కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు. పోరాటయాత్రలో భాగంగా పవన్ విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
JanaSena Chief Pawan Kalyan garu Welcoming new Leaders into the Party.
Full Album : https://t.co/Baamq5KHAY pic.twitter.com/xwIbZg09r8
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2018
ఎలకా వేణుగోపాలరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున 2005లో ఆరంగ్రేటం చేసిన వేణుగోపాలరావు శ్రీలంకతో తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు.
జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్