AP Schools: పిల్లలు ఏప్రిల్ చివరి వరకు ఆ స్కూళ్లో చదువుకున్నారు. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేశారు. తిరిగి బడులు తెరుచుకోవడంతో సంతోషంగా స్కూల్ కు వెళ్లారు. కాని అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులంతా షాకయ్యారు. పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో జూలై5న జరిగిన ఘటన. ఏపీలో సమ్మర్ హాలీడేస్ తర్వాత స్కూళ్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. అయితే స్కూల్ కు వెళ్లిన విద్యార్థులకు పలు ప్రాంతాల్లో షాక్ తగిలింది. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను మూసేసింది జగన్ సర్కార్. దాదాపు8 వేల స్కూళ్లలో కొన్ని తరగతులను బంద్ చేసింది. వేసవి సెలవుల్లోనే సైలెంట్ గా ఈ తతంగాన్ని కానిచ్చేసింది. విషయం తెలియని విద్యార్థులు ఎప్పటిలానే స్కూల్ కు వెళ్లి.. ఇక్కడ లేదని తెలియడంతో ఆందోళన చెందారు.
జగన్ సర్కార్ నిర్ణయంతో స్టూడెంట్స్ ఎవరూ ఏ బడికి వెళ్లాలో తెలియన అయోమయ పరిస్థితి నెలకొంది.చాలా గ్రామాల్లో విద్యార్థులు స్కూల్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. వాగులు, వంకలు దాటుకుని వెళ్లాల్సి వస్తోంది. టీచర్ల సంఖ్యను తగ్గించడానికే స్కూళ్లను విలీనం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం స్కూళ్లను మూసేయలేదని.. పక్క స్కూల్ లో విలీనం చేశామని చెబుతున్నాయి. దాదాపు 8 వేల స్కూళ్ల నుంచి తరగతులను ఇతర స్కూళ్లకు తరలించామని వివరణ ఇస్తున్నారు. కొత్త విద్యా విధానం, హేతు బద్దీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు చేశారు. స్కూళ్లను క్లోజ్ చేయడం లేదని చెబుతూనే విలీనం చేసేస్తున్నారు. గతంలో ఉన్న బడిని మరోక ప్రాంతాలని తరలిస్తే మూసివేత కాక మరేంటని విద్యారంగ నిపుణులు నిలదీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 42 వేల స్కూల్స్ ఉన్నారు. ఇందులో ప్రైమరీ స్కూల్స్ నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు తరలించారు. గతంలోనే 250 మీటర్ల దూరంలోని 3 వేల 627 ప్రైమరీ స్కూళ్ల నుంచి 3, 4, 5 తరగతులను 3,178 హైస్కూళ్లలో విలీనం చేశారు. ఇప్పుడు కిలోమీటరు దూరంలోని 8 వేల 412 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేస్తున్నారు. 6, 7, 8 తరగతుల్లో 100లోపు విద్యార్థులు ఉంటే.. వాళ్లను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూళ్లలో కలిపేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు గ్రామంలో ఉన్న బడులు మూతపడుతున్నాయి. ఏపీ సర్కార్ కొత్త విధానంతో ఏపీలోని 42 వేల స్కూళ్లకు భవష్యత్ లో ఏకంగా 11 వేలకు తగ్గిపోనున్నాయి. ఈ ఏడాదే దాదాపు 8 వేల స్కూళ్లకు మంగళం పాడింది జగన్ సర్కార్. దూరంలో ఉన్న స్కూళ్లకు పంపడనికి ఇష్టలేక తల్లిదండ్రులు ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులను స్కూళ్లకు పంపించడానికి తల్లిదండ్రులకు రవాణా ఛార్జీలు భారం కానున్నాయి.
స్కూళ్ల మధ్య దూరం చూస్తూ విలీనం చేస్తున్నారు కాని విద్యార్థుల ఇంటి దూరాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా విలీనాలతో చిన్న పిల్లలు కొన్ని ప్రాంతాల్లో రహదారులను దాటాల్సి వస్తోంది. వాగులు కూడా ఉంటున్నాయి. ఇవేవి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా విలీనం చేసేస్తున్నారని పిల్లల పేరేంట్స్ మండిపడుతున్నారు. అదనపు తరగతి గదులు లేకపోయినా కొన్నిచోట్ల రికార్డులను మార్చేసి పిల్లలను తరలిస్తున్నారని... టీచర్లు లేకున్నా విలీనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.రెండు స్కూళ్లను విలీనం చేస్తున్నారు కాని.. అక్కడ ఎంతమంది టీచర్లు ఉన్నారు.. తరగతి గదులు సరిపడా ఉన్నాయా లేదా చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న నాడు- నేడు పథకం అంటే ఇదేనా.. బడులను మూసివేయడమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నాడు ఉన్న బడిని నేడు బంద్ చేయడమే జగన్ సర్కార్ విధానమంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
Read also: Editor Gautham Raju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత..
Read also: Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. కొస్తాంధ్ర, గోదావరి జిల్లాలో అర్ధరాత్రి కుండపోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook