Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం, రన్ వేపై నిలిచిన విమానం

Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. 117 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2021, 04:57 PM IST
  • విజయవాడ విమానాశ్రయంలో తప్పిన భారీ ప్రమాదం
  • సాంకేతిక సమస్యతో రన్ వేపై నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానం
  • విజయవాడ నుంచి ఢిల్లీకు వెళ్లాల్సిన 117 మంది ప్రయాణీకులు క్షేమం
Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం, రన్ వేపై నిలిచిన విమానం

Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. 117 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానం విజయవాడ విమానాశ్రయం (Vijayawada Airport)నుంచి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడింది. ఫలితంగా రన్ వేపైనే నిలిచిపోయింది. విజయవాడ నుంచి ఢిల్లీకు బయలుదేరిన ఈ విమానంలో 117 మంది ప్రయాణీకులున్నారు. సాంకేతిక సమస్య కారణంగా గంటల తరబడి రన్ వేపైనే ఉండిపోవల్సి వచ్చింది. టెక్నకల్ టీమ్ లోపాన్ని సరిజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్న ఈ ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) తిరుగు ప్రయాణం సమయంలో సాంకేతిక సమస్య కారణంగా రన్ వేపై ఆగిపోయింది. ఫలితంగా ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గరువుతున్నారు. ప్రయాణికులందర్నీ విమానాశ్రయానికి తరలించి..లోపాన్ని సరిజేస్తున్నారు. పూర్తిగా టేకాఫ్ జరిగిన తరువాత సమస్య తలెత్తి ఉంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేది. భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. 

Also read: AP weather updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన : IMD reports

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News