పేదవారికి ఇల్లుంటాయి. డబ్బున్నవాళ్లకు భవనాలుంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) 27 ఏళ్ల వయసులోనే కొన్ని వేల ఇల్లకు యజమాని అయ్యాడు. ట్రంప్ ఆస్తి గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
అమెరికా ( America ) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బిజినెస్ ఆయన బ్లెడ్ లోనే ఉంది. విజయం ఆయనకు లక్కీ చార్మ్ లాంటిది. ట్రంప్ చేయిపెడితే ఆ వ్యాపారం విజయం సొంతం చేసుకుంటుంది. అత్యంత విలాసవంతమైన నివాసంలో ఉండే ట్రంప్ చిన్నవయసులోనే బిలియనీర్ అయిపోయాడు.
బ్రూక్లిన్ నుంచి వైట్ హౌస్ వరకు..
న్యూయార్క్ లోని బ్రూక్లిన్ నేబర్ హుడ్ నుంచి వాషింగ్టన్ లోని వైట్ హౌస్ ( White House ) వరకు ట్రంప్ ప్రయాణం విజయాల ప్రస్థానం అద్భుతం. దాదాపు యాబై సంవత్సరాల క్రితం తన తండ్రితో కలిసి వ్యాపారం ప్రారంభించిన ట్రంప్ నేడు కొన్ని వేల కోట్లకు అధిపతి. 1971లో న్యూయార్క్ లో మేన్ హటన్ రియల్ ఎస్టేట్ సంస్థను స్థాంపించాడు ట్రంప్. ఈ సంస్థ నుంచి విలాసవంతమైన ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. ఇందులో ట్రంప్ ప్యాలెస్, ట్రంప్ గ్రేట్ టవర్, ఫిప్త్ ఏవెన్యూ, ట్రంప్ టవర్, ట్రంప్ పార్క్, 610 పార్క్ ఏవెన్యూ, ట్రంప్ ప్లాజా వంటి డ్రీమ్ ప్రాజెక్ట్ లు వరుసగా నిర్మించాడు. 27 సంవత్సరాల వయసులోనే 14 వేల నివాసాలు నిర్మించగలిగాడు ట్రంప్.
రాజభవనంలో రాజులా...
మేము వైట్ హౌజ్ గురించి చెప్పడం లేదు.. ట్రంప్ నివాసం గురించి మాట్లాడుతున్నాం. డోనాల్డ్ ట్రంప్ తన ఇంటిని లూయిస్ చౌహద్ శైలిలో 24 క్యారట్ల బంగారం, పాలరాయి సొబగులతో నిర్మించాడు. ఈ ఇంటిని ప్రముఖ సివిల్ ఇంజినీర్ ఏంజిల్ డోంగియా డిజైన్ చేశాడు. ట్రంప్ నివాసంలో 26వ అంతస్తులో అతని ఆఫీస్ ఉంది. తన నివాసాన్ని కాపాడటానికి ట్రంప్ ప్రతీ రోజు 70 కోట్లు ఖర్చుచేస్తాడట.
ఓటమి అంగీకరించడు.. అందుకే గెలుస్తాడు ట్రంప్
అమెరికాన్ వ్యాపార వర్గాల ప్రకారం.. ట్రంప్ నష్టం వచ్చే పని ఏదీ చేయడట. ఈ విషయాన్ని నిత్యం ప్రూవ్ చేస్తుంటాడు ట్రంప్. తన తండ్రి నుంచి 14 మిలియన్ డాలర్లు అప్పుగా తీసుకున్న ట్రంప్ తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. నేడు ట్రంప్ కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యాడు. 1990లో ఆయనకు 700 కోట్ల అప్పు ఉండేది. కావాలంటే దివాల పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ అతను సిటీ బ్యాంక్ నుంచి 65 మిలియన్ డాలర్ల అప్పు తీసుకుని మళ్లీ విజయం ప్రస్థానం కొనసాగించాడు. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగిచూసుకునే అవసరం రాలేదు.