Wine Shops Closed: మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్.. రేపు వైన్‌ షాపులు, మాంసం దుకాణాలు బంద్‌..!

Wine Shops Closed Tomorrow: మందు బాబులు, ఆదివారం మాంసం తినేవారికి బ్యాడ్‌ న్యూస్‌. రేపు జనవరి 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైన్‌ షాపులు, మాంసం విక్రయించే దుకాణాలు బంద్‌ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మద్య, మాంసం ప్రియులకు ఇది షాకింగ్‌ విషయం.
 

1 /5

మందు బాబులకు చేదు వార్త. రేపు రిపబ్లిక్‌ డే సందర్భంగా మద్యం దుకాణాలు బంద్‌ ఉండనున్నాయి. అలాగే రేపు మాంసం విక్రయించే దుకాణాలు కూడా బంద్‌ ఉండనున్నాయి. అంతేకాదు ఈరోజు రాత్రి నుంచే జంతువులను వధించడం బంద్‌.  

2 /5

ఈ సందర్భంగా అన్నీ చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు మూసి వేయాలని విజయవాడ మున్సిపల్‌  కార్పొరేషన్‌ సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు బంద్‌ ఉండనున్నాయి.  

3 /5

అన్నీ పట్టణాల్లో కూడా ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మద్యం, మాంసం తీసుకునేవారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌. జనవరి 26 భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మద్యం, మాంసం బంద్‌ ఉండనుంది.  

4 /5

మరోవైపు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులపాటు వరుసగా మద్యం దుకాణాలు బంద్‌ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8 సందర్భంగా ఆరోజు కూడా మద్యం విక్రయాలు బంద్‌ ఉండనున్నాయి.  

5 /5

ప్రతి జనవరి 26, ఆగష్టు 15, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయి. అంతేకాదు మరిన్ని ప్రత్యేక రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయి. అయితే, ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తగా ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల రోజు, ఫలితాలు రోజు మద్యం దుకాణాలు బంద్‌ చేయిస్తాయి.