బుద్ధి మార్చుకోని పాక్..నిన్న కాళ్ల బేరం.. నేడు మళ్లీ కవ్వింపు చర్యలు

                                    

Last Updated : May 21, 2018, 08:52 PM IST
బుద్ధి మార్చుకోని పాక్..నిన్న కాళ్ల బేరం.. నేడు మళ్లీ కవ్వింపు చర్యలు

భారత భద్రతా దళం విజృంభణతో కాళ్ల బేరానికి వచ్చి శరణం కోరిన పాక్ ఈ రోజు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆదివారం రాత్రి నుంచి భారత బలగాలపై కాల్పులకు పాల్పడుతూనే ఉంది. జమ్ములోని అర్నియా సెక్టార్‌లో గల మూడు బార్డర్‌ అవుట్‌పోస్టులపై ఈ ఉదయం నుంచి పాక్‌ రేంజర్స్‌ కాల్పులకు తెగబడ్డారు. అయితే పాక్‌ చర్యను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.

దాయాది దేశం పాక్ దుశ్చర్యలను ఇంతకాలం సహించిన భారత్ ప్రతికార దాడులతో పాక్ మైండ్‌ బ్లాంక్‌ అయింది. పాక్‌ బంకర్లపైకి రాకెట్లతో దాడి చేసి కాల్పులుకు దిగడంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. బీఎస్ఎఫ్‌  దూకుడు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని గ్రహించిన పాక్‌ రేంజర్లు.. కాల్పులను నిలిపివేయాలని బీఎస్ఎఫ్ వద్దకు వచ్చి ప్రాధేయపడ్డారు. దీంతో భారత బలగాలు కాల్పులను తాత్కాలికంగా విరమింపజేశాయి. అయినప్పటికీ  పాక్ బుద్ధి మార్చుకోలేదు. దొడ్డిదారిలో భారత్ బలగాలపై కాల్పులకు తెగబడి తన కుఠిల రాజనీతిని మరోసారి బయటపెట్టింది.

Trending News