Nobel Prize 2021: వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్‌

వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్‌ పరిశోధకులను నోబెల్‌ బహుమతి వరించింది. డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్‌, డా. అర్డెమ్‌ పటాపౌటియన్‌లుకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరు ఎంపికయ్యారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 06:40 PM IST
  • వైద్యరంగంలో నోబెల్ బహుమతి ప్రకటన
  • ఇద్దరి అమెరికన్లను వరించిన పురస్కారం
  • శరీర వేడి, స్పర్శలో తేడాలపై పరిశోధనకు గానూ అవార్డు
Nobel Prize 2021: వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్‌

Nobel Prize 2021:  ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్‌ బహుమతి(Nobel Prize for medicine)వైద్యశాస్త్రంలో విశేష సేవలందించినందుకు ఇద్దరి అమెరిన్లకు దక్కింది. 2021 సంవత్సరానికి సంబంధించి యూఎస్ కు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌(Ardem Patapoutian)లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్‌ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్‌ జ్యూరీ వెల్లడించింది. 

‘మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలు ఎలా ప్రారంభమవుతాయనే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడంలో ఎంతో కీలకమైనవి’ అని నోబెల్‌ జ్యూరీ అభిప్రాయపడింది. రోజువారీ జీవితంలో ఈ అనుభూతులను చాలా తేలికగా తీసుకుంటాం.. కానీ, ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపించబడతాయనే ప్రశ్నలకు తాజాగా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారని నోబెల్‌ జ్యూరీ అభిప్రాయపడింది.

Also Read: Pandora Papers Scandal 2021: పండోరా పేపర్స్ అంటే ఏమిటి, సచిన్ పేరుందా లేదా

డేవిడ్‌ జూలియస్‌(David Julius) అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మరో శాస్త్రవేత్త అర్డెమ్‌ పటాపౌటియన్‌ కూడా కాలిఫోర్నియాలోని స్క్రిస్స్‌ రీసెర్చ్‌లో కేంద్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ నోబెల్ పురస్కారం(Nobel Prize) కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14 మిలియన్లకు పైగా) నగదు బహమతిగా అందజేస్తారు. ప్రైజ్ మనీ సృష్టికర్త, స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) 1895 లో మరణించారు. అప్పటి నుంచి ఆయన పేరుతో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి నోబెల్ బహుమతిని అందజేస్తున్నారు. వైద్య శాస్త్రంతోపాటు భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్ర రంగాలలో అత్యుత్తమమైన సేవలందించినవారికి ఈ  బహుమతి ప్రకటిస్తుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News