Jimmy Carter: నోబెల్ అవార్డు గ్రహీత, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు . అనారోగ్య సమస్యలతో ఆయన జార్జియాలోని ప్లెయిన్స్ లో తుది శ్వాస విడిచారు. జిమ్మీ కార్టర్ మరణించినందుకు గౌరవసూచకంగా జనవరి 28, 2025 వరకు జెండా సగం స్టాఫ్‌లో ఉంటుంది. మాజీ అధ్యక్షుడికి అమెరికన్లు రుణపడి ఉంటారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జిమ్మీ కార్టర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్సులో కీలక పరిశోధనలు చేసినందుకుగాను వారిని ఈ నోబెల్ పురస్కారాలు వరించాయి.
Nobel prize in Physics 2022: ఈ ఏడాది భౌతిక నోబెల్ ముగ్గురికి దక్కింది. క్వాంటమ్ మెకానిక్స్ లో అద్భుతమైన పరిశోధనలు చేసిన అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్‌లకు ఈ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
Abdulrazak Gurnah: టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం లభించింది. తన రచనల్లో శరణార్ధుల కష్టాలను గర్నా ప్రతిబింబించారు.
Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో 2021కి గాను నోబెల్ బహుమతిని బెంజమిన్ లిస్ట్, డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్ దక్కించుకున్నారు. అణు నిర్మాణానికి ఉపయోగపడే.. అసిమెట్రిక్ ఆర్గానోకెటాలిసిస్ను అభివృద్ధికి దోహదం చేసినందుకు వీరిని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
భౌతిక శాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. సుకురో మనాబో, క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్ పరిశోధకులను నోబెల్ బహుమతి వరించింది. డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అర్డెమ్ పటాపౌటియన్‌లుకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరు ఎంపికయ్యారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని (Nobel Peace Prize 2020) నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు కృషి చేసిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) కు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.
రసాయన శాస్త్రంలో 2020 నోబెల్ పురస్కారం ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించింది. జీనోమ్ ఎడిటింగ్ (genome editing) విధానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు.. రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఎమ్మాన్యుల్లే చార్పెంటియర్ (Emmanuelle Charpentier ), జెనిఫర్ ఏ డౌడ్నా (Jennifer A Doudna) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు.
Nobel Prize in Physics: న్యూఢిల్లీ: భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది. కృష్ణ బిలం, పాలపుంతపై జరిపిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు
నోబెల్ ప్రైజ్.. ఇప్పటి వరకు రవీంద్రనాథ్ టాగూర్, అమర్త్యాసేన్, కైలాష్ సత్యర్థి లాంటి భారతీయులకు మాత్రమే లభించిన అద్భుతమైన పురస్కారం. అలాంటి పురస్కారానికి ఓసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రచయిత కూడా నామినేట్ అయ్యారట.
బ్రిటన్ కు మరోసారి నోబెల్ పురస్కారం దక్కింది. నవలా రచయిత కజువో ఇషిగురో రాసిన "ది రిమైన్స్ అఫ్ ది డే" పుస్తకానికి సాహితీ రంగంలో నోబెల్ పురస్కారం వరించినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. 62 ఏళ్ల ఇషిగురో జపాన్ లోని నాగసాకీ లో జన్మించారు. బాల్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు బ్రిటన్ కు వలస వచ్చి స్థిరపడ్డారు. 1982 లో "ది పేల్ వ్యూ అఫ్ హిల్స్" అనే మొదటి నవలను రాశారు. అదే సంవత్సరంలో ఆయనకు బ్రిటన్ పౌరసత్వం లభించింది.
నోబెల్ పురస్కారం ఈ యేడు రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం జారీ చేసిన ప్రకటన ప్రకారం లైఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్‌కు సంబంధించిన త్రీడీ చిత్రాల తయారీల గురించి పరిశోధనలు జరిపినందుకు గాను వీరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన జాక్స్ దుబోచెట్, జోచిమ్ ఫ్రాంక్(యూఎస్ఏ), రిచర్డ్ హెండర్సన్(యూకే)లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.