అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ వ్యాఖ్యాలు దుమారాలు రేపుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్ష పదవి గురించి అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) కీలక వ్యాఖ్యాలు చేశారు. అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ ( Kamala Haris ) , తన కూతురు ఇవాంకా ట్రంప్ ను పోల్చుతూ వ్యాఖ్యాలు చేశారు. కమలా హారిస్ కన్నా ఇవాంకా ట్రంప్ ప్రెసిడెన్షియల్ రేసులో బెస్టు అని కామెంట్ చేశాడు.
న్యూ హంప్ షైర్ లో జరిగిన రిపబ్లికన్ క్యాంపెయిన్ లో తన ససోర్టర్స్ లో ఉత్సాహం పెంచుతూ అధ్యక్షుడి పోస్టుకు మహిళ అయితే మరింత బాగుంటుంది అని కామెంట్ చేశాడు. అమెరికాను మహిళా అధ్యక్షురాలు ఏలుతుంటే చూడాలని ఉంది అన్నారు. తన కూతురు ఇవాంకా ( Ivanka Trump ) ఆ పదవికి అన్ని విధాలుగా కరెక్ట్ అని తెలిపాడు ట్రంప్. 2019 వరకు అధ్యక్షపదివి కోసం రేసులో ఉన్న కమలా హరిస్ తగినంత మద్ధతు లేకపోవడంతో ఇప్పుడు ఉపాధ్యక్షపదవికి పోటీ చేస్తున్నారని తెలిపారు ట్రంప్.