Pakistan Independence Day 2023: భారత్‌ కంటే ఒక రోజు ముందే పాకిస్థాన్‌లో ఇండిపెండెన్స్ డే.. అసలు కారణం ఏంటో తెలుసా..!

Independence Day 2023 Specials: భారత్, పాకిస్థాన్ దేశాలు స్వాతంత్య్రం వచ్చిన 1948 ఆగస్టు 15వ తేదీనే విడిపోయాయి. కానీ పాకిస్థాన్‌లో ఒక రోజు ముందుగానే ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుపుకుంటారు. దీనికి వెనుక అసలు కారణం ఏంటి..? అప్పుడు ఏం జరిగింది..?  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 14, 2023, 03:15 PM IST
Pakistan Independence Day 2023: భారత్‌ కంటే ఒక రోజు ముందే పాకిస్థాన్‌లో ఇండిపెండెన్స్ డే.. అసలు కారణం ఏంటో తెలుసా..!

Independence Day 2023 Specials: అనేక పోరాటాలు, ఉద్యమాల తరువాత బ్రిటిష్ పరిపాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. స్వాతంత్య్రం లభించిన రోజే భారత్ నుంచి పాకిస్థాన్ వీడిపోయి ప్రత్యేకంగా ఏర్పడింది. దయాది దేశంలో ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటే.. మన దేశంలో ఆగస్టు 15న నిర్వహిస్తున్నారు. రెండు దేశాలకు ఒకే స్వాతంత్య్రం లభించినా.. ఎందుకు పాకిస్థాన్‌లో ఒక రోజు ముందు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. 

బెంగాల్, పంజాబ్ ప్రావిన్సులను విభజించి.. 1947 భారత స్వాతంత్య్ర చట్టం రెండు కొత్త స్వతంత్ర దేశాలను స్థాపించింది. చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశం రెండు దేశాలు ఏర్పడుతుందని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ స్టాండర్డ్ టైమ్ (పీఎస్‌టీ), ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్‌టీ) మధ్య 30 నిమిషాల తేడా ఉంటుంది. ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్య్రం పొందగా..  పాకిస్థాన్‌లో స్థానిక సమయం ఆగస్టు 14 రాత్రి 11:30. ఇది ఒక కారణంగా చెబుతున్నారు.

బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్‌గా లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు షెడ్యూల్ ఫుల్‌ బిజీగా ఉండేది. స్వాతంత్య్రం ఇచ్చిన సమయంలో బ్రిటిష్ ప్రతినిధిగా ఆయన అధికారాలను రెండు దేశాలకు బదలాయించే బాధ్యతపై ఆయనపై ఉండేది. ముందుగా కరాచీ వెళ్లిన బాటన్.. పాకిస్థాన్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14న అధికారాలను అప్పగించారు. ఈ సమయంలో ప్రసంగిస్తూ.. కొత్త దేశం పాకిస్థాన్ రేపటి నుంచి మీ చేతుల్లో ఉంటుందని క్లారిటీగా చెప్పారు. మరుసటి రోజు ఆగస్టు 15వ తేదీన భారత్‌కు అధికారాలు బదలాయించారు. అంటే రెండు దేశాలకు ఒకే రోజు స్వాతంత్ర్య దినోత్సవం. 

మరుసటి ఏడాది అంటే.. 1948 ఆగస్టు 15న భారత్‌తోపాటు ఇండిపెండెన్స్‌ను జరుపుకోవాల్సి ఉంది. జూలై నెల వరకు కూడా అన్ని పోస్టల్ స్టాంప్స్‌పై ఆగస్టు 15నే స్వాతంత్ర్య దినోత్సవంగా పేర్కొంది. అయితే అంతముందు నెలలోనే అంటే జూన్ 1948లో పాక్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం జరిగింది. భారత్ కంటే ఒకరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.. ఇందుకు మహమ్మద్ జిన్నా కూడా తన ఆమోదం తెలిపారు. దీంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 14వ తేదీనే పాకిస్థాన్‌లో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి. 

Also Read: Ind Vs WI 5th T20 Highlights: మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్.. హార్థిక్ పాండ్యాను ఆడుకుంటున్న ఫ్యాన్స్  

Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News