జాబ్ కోసం వెరైటీగా ఆలోచించాడు.. బంపర్ ఆఫర్ కొట్టాడు

కాలిఫోర్నియాలోని 26 ఏళ్ల డేవిడ్ కాసారేజ్‌కు ఉండటానికి ఇల్లు లేదు.. చేతిలో ఉపాధి లేదు.

Last Updated : Jul 30, 2018, 06:21 PM IST
జాబ్ కోసం వెరైటీగా ఆలోచించాడు.. బంపర్ ఆఫర్ కొట్టాడు

కాలిఫోర్నియాలోని 26 ఏళ్ల డేవిడ్ కాసారేజ్‌కు ఉండటానికి ఇల్లు లేదు.. చేతిలో ఉపాధి లేదు. జాబ్ కోసం ప్రయత్నించి.. ప్రయత్నించి తన వద్ద ఉన్న డబ్బులను పోగొట్టుకున్నాడు. దీంతో ఈ వెబ్ డెవలపర్ ఓ ఉద్యోగం కోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు. 'ఇల్లు లేదు.. విజయం దక్కలేదు.. దయచేసి రెస్యూమ్ తీసుకోండి' అని కాలిఫోర్నియా మౌంటెన్ వ్యూలో రోడ్డుపై మెడలో ప్లకార్డు ధరించి నిల్చున్నాడు. డబ్బులు వద్దని.. జాబ్ కావాలని అందరికీ బయోడేటాలను పంచాడు. రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళ ఇది గమనించి అతడికి సహాయం చేయాలని అనుకొంది. అంతే.. అతడి ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దాంతో అతడికి 200 కంపెనీల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. గూగుల్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. అయితే ఈ 200 ఆఫర్లల్లో ఏ ఉద్యోగానికి వెళ్లాలో డేవిడ్ అర్థం కాక సతమతమవుతున్నాడు.

డేవిడ్ టెక్సాస్‌లోని ఏ&ఎం యూనివర్సిటీలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో డిగ్రీ పూర్తి చేశాడు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జనరల్ మోటార్స్ వెబ్ డెవలపర్‌గా పనిచేశాడు. అయితే స్టార్‌అప్ కంపెనీ ప్రారంభించాలనుకొని కాలిఫోర్నియాకు షిఫ్ట్ అయ్యాడు. ఈ ప్రయత్నంలో అతడు డబ్బులను, తన కారును పోగొట్టుకున్నాడు. ఆయన రాత్రిళ్ళు పార్కుల్లో నిద్రించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Trending News