Petrol Price: లీటర్ పెట్రోల్ ధర రూ. 338.. లబోదిబోమంటున్న సామాన్య ప్రజలు!

Litre Petrol Rs 338 in Sri Lanka. శ్రీలంకలో పెట్రోలియం కార్పొరేషన్ ఒకేసారి ఏకంగా లీటర్ పెట్రోల్ ధరపై 84 రూపాయల మేర పెంచింది. దీంతో లంకలో లీటర్ పెట్రోల్ ధర 338 శ్రీలంక రూపాయలకు చేరింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 10:20 PM IST
  • లీటర్ పెట్రోల్ ధర రూ. 338
  • లబోదిబోమంటున్న సామాన్య ప్రజలు
  • దేశవ్యాప్తంగా నిరసనలు
Petrol Price: లీటర్ పెట్రోల్ ధర రూ. 338.. లబోదిబోమంటున్న సామాన్య ప్రజలు!

Petrol sold at Rs 338 per litre in Sri Lanka: శ్రీలంకలో సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సామాన్యుల బతుకు నరకప్రాయంగా మారుతోంది. ఇప్పటికే చుక్కలనంటిన నిత్యావసరాల ధరలతో జనాలు కడుపునింపుకోవడానికే నానా కష్టాలు పడుతున్నారు. పెట్రోల్ కొరత, కరెంటు కష్టాలతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటుతుండటం, శ్రీలంక రూపాయి విలువ దారుణంగా పతనమవుతుండటంతో ఆ దేశం కోలుకోలేని సంక్షోభంలో చిక్కుకుపోతోంది. 

ఇప్పటికే బతుకుభారమైన శ్రీలంకవాసులపై మరో పిడుగు పడింది. పెట్రో ధరలను భారీగా పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఏకంగా పెట్రోల్ ధర 84 రూపాయల మేర పెంచింది. దీంతో లంకలో లీటర్ పెట్రోల్ ధర 338 శ్రీలంక రూపాయలకు చేరింది. అయితే ఇంత ధర పెట్టినా ఆదేశంలో పెట్రోల్ మాత్రం తగినంత లభ్యం కావడం లేదు. దీంతో రేషన్ పద్దతిలో కోటా పెట్టి మరీ పెట్రోల్ ను సరఫరా చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం.

నిత్య కష్టాలతో విసిగెత్తిపోయిన శ్రీలంక ప్రజలు కొద్దిరోజులుగా తీవ్రనిరసన తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లో విధ్వంసానికి దిగుతున్నారు. తాజాగా కొలంబోకు వెళ్లే జాతీయ రహదారులను దిగ్బందించారు నిరసనకారులు. రోడ్లపై టైర్లు అడ్డంగా వేసి నిప్పంటించారు. దీంతో కొలంబోకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజపక్సే సర్కారే ఈ సంక్షోభానికి కారణమని శ్రీలంకవాసులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం గద్దెదిగాలని దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అటు సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం చేస్తోంది. నిత్యావసరాలతో పాటు మెడిసిన్, పెట్రో ఉత్పత్తులను రవాణా చేస్తోంది.

Also Read: Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్

Also Read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News