China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) విషయంలో తమపై లేనిపోని నిందలు మోపి తమ దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని.. కానీ వాస్తవానికి కరోనా చైనాలో పుట్టలేదని ( Coronavirus origin ) చైనా అభిప్రాయపడింది. చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్‌లో గబ్బిలాలు, పాంగోలిన్ల మాంసం వినియోగం వల్లే కరోనావైరస్ పుట్టుకొచ్చిందనే ఆరోపణల్లోనూ నిజం లేదని హువా తెలిపారు.

Last Updated : Oct 10, 2020, 06:04 PM IST
China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

బీజింగ్: కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) విషయంలో తమపై లేనిపోని నిందలు మోపి తమ దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని.. కానీ వాస్తవానికి కరోనా చైనాలో పుట్టలేదని ( Coronavirus origin ) చైనా అభిప్రాయపడింది. కరోనావైరస్‌ ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాపించి ఉంది కానీ దానిని మొదటిసారిగా గుర్తించింది మాత్రం చైనానే అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ( Chinese Foreign Ministry spokesperson Hua Chunying) పేర్కొన్నారు. అలాగే చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్‌లో గబ్బిలాలు, పాంగోలిన్ల మాంసం వినియోగం వల్లే కరోనావైరస్ పుట్టుకొచ్చిందనే ఆరోపణల్లోనూ నిజం లేదని హువా తెలిపారు. కరోనావైరస్ ( COVID-19 infection ) గురించి ఇప్పుడిప్పుడే అనేక వాస్తవాలు వెలుగుచూస్తున్నాయని హువా వెల్లడించారు. Also read : Mike Pompeo: భారత సరిహద్దులో 60వేల మంది చైనా సైనికులు

చైనా ( China ) వల్లే ప్రపంచం కరోనా సంక్షోభంలో పడిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ( US Secretary of State Mike Pompeo ) చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

కరోనావైరస్ కనుగొంది మొదలు నేటివరకు చైనాపై అనేక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వుహాన్‌లోని ( Wuhan city ) ల్యాబ్‌లోనే కరోనా పుట్టిందని ఆరోపిస్తూ అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఆరోపించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించడానికి చైనానే కారణం అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. Also read : COVID-19 test result: 30 సెకన్లలో కరోనా ఫలితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News