Indians Travel Ban: ఇండియా ప్యాసింజర్స్‌పై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత, మరికొన్ని దేశాలకు ఊరట

Travel Ban lifted for Indians: డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్19 కేసులు నమోదవుతున్నా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2021, 10:07 AM IST
Indians Travel Ban: ఇండియా ప్యాసింజర్స్‌పై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత, మరికొన్ని దేశాలకు ఊరట

Travel Ban lifted for Indians: డెల్టా వేరియంట్ కేసులు నమోదు ప్రారంభమైన సమయంలో పలు దేశాలు భారత్‌ నుంచి రాకపోకలను నిషేధించాయి. ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ, జర్మనీ సహా పలు దేశాలు భారత్‌కు విమానాల రాకపోకలను నిషేధించడం తెలిసిందే. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్19 కేసులు నమోదవుతున్నా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా జర్మనీ ప్రభుత్వం భారత్ నుంచి ప్రయాణ ఆంక్షల్ని ఎత్తివేసింది. భారతీయులు జర్మనీకి ప్రయాణించవచ్చునని ప్రభుత్వం సోమవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. అయితే జర్మనీ చేరుకున్నాక అక్కడ 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని కోవిడ్19 (India COVID-19 Cases) నిబంధనలు అమలు చేస్తోంది. ఒకవేళ భారత్ నుంచి జర్మనీకి చేరుకున్న ప్రయాణాలు కరోనా టెస్టుల్లో నెగటివ్‌గా తేలితే కేవలం 5 రోజుల క్వారంటైన్ ముగించుకుని, వెళ్లిపోవచ్చునని ప్రకటనలో పేర్కొంది. జర్మనీ నేషనల్ డిసీజ్ కంట్రోల్ సెండర్ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ సోమవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించింది.

Also Read: Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు

భారత్‌తో పాటు బ్రిటన్, పోర్చుగల్, రష్యా, నేపాల్ దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత నిర్ణయం జులై 7వ తేదీ నుంచి అమలులోకి రానుంది. డెల్టా వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ దేశాలపై జర్మనీ ట్రావెల్ బ్యాన్ (Travel Ban From India) విధించింది. అయితే గత కొన్ని రోజులగా కరోనా పాజిటివిటీ రేటు తగ్గడంతో ఆ దేశాల నుంచి తమ దేశానికి ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. క్వారంటైన్ మాత్రం తప్పనిసరి చేస్తూ ప్రయాణ ఆంక్షల్ని సడలించింది. ప్రస్తుతం కొన్ని దేశాల నుంచి మాత్రమే ప్రయాణికులను అమనుతించినా, బోట్స్‌వానా, బ్రెజిల్, ఇస్వాటిని, లెసోతో, మాలావి, మోజాంబిక్, నమీబియా, జాంబియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా మరియు ఉరుగ్వేలపై ట్రావెల్ బ్యాన్ కొనసాగుతుందని ఓ ప్రకటనలో జర్మనీ ప్రభుత్వం తెలిపింది.

Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News