న్యూఢిల్లీ: చైనా దేశం పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ నోట్లను ముద్రిస్తోందని.. అందులో భారత కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయని.. చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి కరెన్సీని ముద్రించమని తమ దేశానికి ఆర్డర్లు వచ్చాయని చైనా మీడియా కథనాల సారాంశం. చైనాలోని నగదు ఉత్పత్తి ప్లాంట్లలో నగదు ముద్రణ నిర్విరామంగా సాగుతున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక వార్త వెలువరించింది.
ఇండియా, బ్రెజిల్, నేపాల్, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, పోలాండ్ దేశాల నుంచి ఆర్డర్‌లు వచ్చినట్లు.. చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ప్లాంట్ లో నోట్ల ముద్రణ జరుగుతోందని వెల్లడించాయి. 'బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్'లో భాగంగా చైనాకు ఇంత పెద్దఎత్తున కరెన్సీ ముద్రణ కాంట్రాక్టులు వచ్చాయని.. దాంతో చేతి నిండా పనిదొరికిందని పేర్కొంది. విభాగాల వారీగా అన్ని షిప్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారని కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ కథనం నిజమైతే.. ఇది జాతి భద్రతకు ముప్పుగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు.
If true, this has disturbing national security implications. Not to mention making it easier for Pak to counterfeit. @PiyushGoyal @arunjaitley please clarify! https://t.co/POD2CcNNuL
— Shashi Tharoor (@ShashiTharoor) August 12, 2018