Joe Biden Wishes: 135 కోట్ల భారతీయులకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుభాకాంక్షలు

Joe Biden Wishes: ఇండియాతో అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ ఆకాంక్షించారు. ఇండియాకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2021, 03:34 PM IST
Joe Biden Wishes: 135 కోట్ల భారతీయులకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుభాకాంక్షలు

Joe Biden Wishes: ఇండియాతో అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ ఆకాంక్షించారు. ఇండియాకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(75th Independence Day Celebrations) జరుపుకుంటున్న ఇండియాకు పలు దేశాలు శుభాకాంక్షలు అందించాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కంటే ఇండియాతో భాగస్వామ్యం మరింత బలపడాలని జో బిడెన్ కోరారు. చాలా దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు చెక్కుచెదరలేదని..40 లక్షలమంది ఇండో అమెరికన్లు ఈ బంధాన్ని మరింత పటిష్టం చేశారని జో బిడెన్ సందేశం పంపించారు.1947 ఆగస్టు 15న జర్నీ ప్రారంభించిన ఇండియా..అహింస, శాంతియుత మార్గాల్ని ప్రబోధించిన మహాత్మా గాంధీ మార్గంలో నడిచిందని చెప్పారు. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల అభిమతాన్ని గౌరవించాలన్న నిబద్ధత ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందని జో బిడెన్(Joe Biden)తెలిపారు. ఈ ప్రజాస్వామ్యమే ఇండియా-అమెరికాల మధ్య ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ఏడాదికాలంగా కరోనా నియంత్రణకు గట్టిగా కృష్టి చేశామని గుర్తు చేశారు. రెండు దేశాలు ఇప్పుడు సురక్షితమైన వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తూ..లక్షలాది ప్రజల ప్రాణాల్ని రక్షించగలుగుతున్నాయన్నారు. కోవిడ్ సృష్టించిన సవాళ్లతో ఇండియా-అమెరికాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యాయన్నారు. 

Also read: Afghanistan: ఆఫ్ఘన్‌పై తాలిబన్ల ఆధిపత్యం, త్వరలోనే అధికారిక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News