PM MODI TOUR: డుమ్మా కొట్టిన కేసీఆర్.. గళమెత్తిన స్టాలిన్! ప్రధాని పర్యటనలో ఇద్దరు సీఎంల తీరుపై చర్చ..

PM MODI TOUR: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిలో పర్యటించారు. హైదరాబాద్ , చెన్నైలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రధాని మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం ఒకలా.. తమిళనాడు ముఖ్యమంత్రి మరోలా వ్యవహరించారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి డుమ్మా కొట్టి బెంగళూరు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ప్రధాని మోడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Last Updated : May 27, 2022, 07:50 AM IST
  • ప్రధాని మోడీ పర్యటనకు కేసీఆర్ డుమ్మా
  • ప్రధాని ముందే తమిళ సమస్యలు గళమెత్తిన స్టాలిన్
  • స్టాలిన్ తో పోల్చుతూ కేసీఆర్ పై విమర్శలు
PM MODI TOUR: డుమ్మా కొట్టిన కేసీఆర్.. గళమెత్తిన స్టాలిన్! ప్రధాని పర్యటనలో ఇద్దరు సీఎంల తీరుపై చర్చ..

PM MODI TOUR: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిలో పర్యటించారు. హైదరాబాద్ , చెన్నైలో పర్యటించిన మోడీ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఐఎస్ బీలో జరిగిన వార్షికోత్సవానికి హాజరయ్యారు. అంతకుముందు తనకు స్వాగతం పలికిన పార్టీ నేతలు, కేడర్ ను ఉద్దేశించి  బేగంపేట ఎయిర్ పోర్టు దగ్గర ప్రసంగించారు మోడీ. తర్వాత చెన్నై వెళ్లిన ప్రధాని.. 30 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రధాని హైదరాబాద్, చెన్నై పర్యటనలు అధికారింగా జరిగినవి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అంతేకాదు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. దీంతో ప్రధాని పర్యటనలో తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే ప్రధాని మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం ఒకలా.. తమిళనాడు ముఖ్యమంత్రి మరోలా వ్యవహరించారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి డుమ్మా కొట్టి బెంగళూరు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ప్రధాని మోడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల తీరుపై జోరుగా చర్చ సాగుతోంది.

హైదరాబాద్ ఐఎస్ బీ 20వ వార్షికోత్సవానికి వచ్చారు ప్రధాని మోడీ. ఈ వేడుకలు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. కాని కేసీఆర్ మాత్రం బెంగళూరు వెళ్లి.. తన రాజకీయ పర్యటనల్లో భాగంగా మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు.  ప్రధాని మోడీకి స్వాగతం చెప్పడం.. ఆయనతో కలిసి ఐఎస్బీ కార్యక్రమానికి వెళ్లడం ఇష్టం లేకే కేసీఆర్ బెంగళూరు టూర్ ప్లాన్ చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. మోడికి ముఖం చూపించలేకే కేసీఆర్ బెంగళూరు పారిపోయారని రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ బెంగళూరు టూర్ ఎప్పుడో ఖరారైందని చెబుతున్నారు. నిజానికి బీజేపీని టీఆర్ఎస్ కంటే డీఎంకే పార్టీనే ఎక్కువ వ్యతిరేకిస్తుంది. అయినా డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం చెన్నై వచ్చిన ప్రధాని మోడీకి విమానాశ్రయంలో వెల్ కం చెప్పారు. ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు ప్రధాని మోడీ ముందే తమిళ సమస్యలపై గళమెత్తారు. ఒక రకంగా ప్రధాని మోడీని, బీజేపీని నిలదీసినంత పని చేశారు స్టాలిన్.

తమిళనాడుకు కేంద్రం నుంచి నిధులు రావడం లేదని అన్నారు స్టాలిన్. రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తేల్చిచెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయన్నాకు. తమిళనాడుకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని సభా వేదికాగనే స్టాలిన్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పథకాలు ప్రారంభిస్తున్నారని.. వాటికి నిధులు సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ రాష్ట్ర హక్కులు తాము వదులుకోమని తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. నీట్ ఎగ్జామ్ నుంచి తమిళ విద్యార్థులకు మినహాయింపు  స్టాలిన్ విన్నవించారు. తమిళ భాషపైనా ప్రధానికి తన వాయిస్ గట్టిగా వినిపించారు. మద్రాస్ హైకోర్టుతో పాటు తమిళనాడులోని కేంద్ర సర్కార్ కార్యాలయాల్లో తమిళ భాషను అధికారిక భాషగా ప్రకటించాలని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ సభలో సీఎం స్టాలిన్ తమిళ సమస్యలపై గళమెత్తిన తీరుపై ప్రశంసలు వస్తున్నాయి. ప్రధాని పర్యటనను స్టాలిన్ అద్భుతంగా ఉపయోగించుకున్నారని.. బీజేపీని ఇరుకున పెట్టేలా రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి ప్రధాని మోడీకి షాక్ ఇచ్చారనే టాక్ వస్తోంది.

తమిళనాడు సీఎం స్టాలిన్ తీరును ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు కొందరు నేతలు. సోషల్ మీడియాలోనూ కేసీఆర్ తీరుపై నెటిజన్లు ఫైరవుతున్నాయి. ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరై రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేలా.. కొత్త ప్రాజెక్టులు వచ్చేలా ప్రయత్నించాలని కాని.. డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవించాలన్నారు. కేసీఆర్ కంటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే స్టాలిన్.. ప్రధానికి స్వాగతం చెప్పలేదా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలిశాయి. తెలంగాణకు సంబంధించిన 17 సమస్యలను ప్రస్తావిస్తూ మోడీని నిలదీశారు అందులో. వీటిని టీఆర్ఎసే ఏర్పాటు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఇలా బ్యానర్లలో పెట్టి ప్రచారం చేసుకోవడం కంటే.. నేరుగా ప్రధానిని కలిసి నిలదీస్తే సరిపోయేది కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని ముందే తమ రాష్ట్ర సమస్యలు గళమెత్తారని.. కేసీఆర్ అలా ఎందుకు చేయలేకపోయారనే చర్చ తెలంగాణ జనాల్లో సాగుతోంది. మొత్తంగా ప్రధాని మోడీ పర్యటనలో కేసీఆర్ తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

READ ALSO: Harish Rao: ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు... ప్రధాని నరేంద్ర మోదీకి హరీశ్ రావు గట్టి కౌంటర్... 

READ ALSO: Modi @ 8 Years: ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం, నెంబర్ 8తో మోదీ లింక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News