Senthil Balaji Dismissal: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ.. గవర్నర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అయితే మళ్లీ ఆ ఉత్తర్వులకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు.
Tamil Nadu Assembly : తమిళ నాడు సర్కారుకి, గవర్నర్‌కి మధ్య ఉన్న కోల్డ్ వార్ అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. గవర్నర్ ప్రారంభోపన్యాసం మీద గందరగోళం నెలకొంది.
CM Stalin Letter: రాష్ట్రాల మధ్య జల వివాదాలు కామన్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. కృష్ణా రివర్ బోర్జుకు ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ తెరపైకి వచ్చింది.
Separate Tamilnadu: తమిళనాట మరోసారి విభజన స్వరం విన్పిస్తోంది. తమిళనాడుకు చెందిన మాజీ కేంద్రమంత్రి, అధికార డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తామని హెచ్చరించారు.
PM MODI TOUR: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిలో పర్యటించారు. హైదరాబాద్ , చెన్నైలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రధాని మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం ఒకలా.. తమిళనాడు ముఖ్యమంత్రి మరోలా వ్యవహరించారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి డుమ్మా కొట్టి బెంగళూరు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ప్రధాని మోడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Tamil Nadu: తమిళనాడులో విషాదం నెలకొంది. తిరునల్వేలి జిల్లా మునీర్ పల్లంలోని క్వారీలో బండరాళ్లు పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. క్వారీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో బండరాళ్లు మీద పడ్డాయి.
CM Stalin: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను సైతం కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించి..మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.